ఆ పలకల కోసం బాగానే కష్టపడుతున్నాడు

Update: 2016-12-07 07:30 GMT
కెరీర్ ప్రారంభం నుంచి నారా రోహిత్ విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఒకట్రెండు మాస్ సినిమాలు చేసి రూట్ మార్చినా.. జ్యో అచ్యుతానంద లాంటి సినిమాతో తన వెర్సటాలిటీ చూపించాడు. ఇప్పుడు తన మరుసటి చిత్రం కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ చేసేందుకు కష్టపడుతున్నాడు నారా వారబ్బాయి.

బబ్లీగా ఉండే నారా రోహిత్ పర్సనాలిటీపై ముందు నుంచి విమర్శలున్నాయి. అయితే.. తాను లావు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో కూడా చెప్పాడు కానీ.. మళ్లీ వాటిని మధ్యలోనే వదిలేశానని తనే చెప్పాడు. ప్రస్తుతం కొత్త దర్శకుడు ప్రవీణ్ మల్లాల దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీకి యాక్సెప్ట్ చేశాడు నారా రోహిత్. ఈ మూవీ కూడా మాస్ చిత్రమే అయినా.. ఫిజిక్ విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టాడీ కుర్ర హీరో.

లావు తగ్గడం మాత్రమే కాకుండా.. సిక్స్ ప్యాక్ చేసి మరీ ఆడియన్స్ ను థ్రిల్ చేయాలని ఫిక్స్ అయిన రోహిత్.. ఇందుకోసం ప్రతీ రోజు ఉదయం 2 గంటలు.. సాయంత్రం 2 గంటలు జిమ్ లో కష్టపడుతున్నాడు. ఇందుకోసం స్పెషల్ ట్రైనర్ ను కూడా రిక్రూట్ చేసుకున్నాడు రోహిత్. అసలే అందగాడు.. అందులోనూ వాయిస్ అండ్ మాడ్యులేషన్ లో తనకంటూ స్పెషల్ స్టైల్ ఉంది. వీటికి సిక్స్ ప్యాక్ కూడా తోడైతే.. ఇక నారా రోహిత్ స్టార్ రేసులోకి ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ ఇచ్చేస్తున్నట్లే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News