రాసిస్తున్నా.. రీమేక్ కోసం పోటీ పడతారు

Update: 2016-02-04 09:30 GMT
‘గుంటూరు టాకీస్’ మూవీ స్యూర్ షాట్ హిట్ అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్. తన కెరీర్లో ‘గుంటూరు టాకీస్’ ఓ మైల్ స్టోన్ మూవీ అని.. ఇది తనకు ట్రంప్ కార్డులాగా ఉపయోగపడుతుందని నరేష్ అన్నాడు. ‘గుంటూరు టాకీస్’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది అద్భుతంగా ఆరంభమైంది. సంక్రాంతి సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఆ కోవలోనే ‘గుంటూరు టాకీస్’ కూడా ఈ ఏడాది మంచి విజయాన్నందుకుంటుంది. ఇది స్యూర్ షాట్ హిట్ మూవీ. ఈ రోజు రాసిస్తున్నా.. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం వేరే భాషల వాళ్లు పోటీ పడతారు. ఇదొక యూనివర్శల్ మూవీ’’ అని నరేష్ చాలా ఉద్వేగంగా చెప్పాడు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాలయ్య గురించి చెబుతూ... ‘‘ఈ తరంలో కృష్ణుడంటే బాలయ్యే. అలాగే నారదుడంటే నేను. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాకు నన్ను నారదుడిగా తీసుకోమని సజెస్ట్ చేసింది బాలయ్యే. మా ఇద్దరిదీ గొప్ప అనుబంధం. సంక్రాంతికి డిక్టేటర్ తో బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. ఆయనకు కంగ్రాట్స్’’ అని చెప్పాడు నరేష్. ‘చందమామ కథలు’ సినిమాలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తనతో లిప్ లాక్ చేయించాడని.. అలాగే ‘గుంటూరు టాకీస్’లో తనకు శ్రద్ధా దాస్ తో ఓ రొమాంటిక్ సీన్ ఉంటుందని.. అదేంటన్నది ఇప్పుడే చెప్పనని నరేష్ అన్నాడు. ఈ సినిమాలో తనది హీరో లాంటి పాత్రేనని నరేష్ చెప్పాడు
Tags:    

Similar News