అందుకే ఇండియా వచ్చిందా??

Update: 2017-11-20 08:19 GMT
హాలీవుడ్ మోడల్ కం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ.. బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. నేటివ్ గా అమెరికన్ అయిన ఈమెకు ఇండియాలో కూడా డిమాండ్ బాగానే ఉంది కానీ.. మూవీస్ కౌంట్ తక్కువగానే ఉంటుంది. గతేడాది బాంజో మూవీ తర్వాత ఇప్పటివరకూ హిందీ సినిమా ఏదీ యాక్సెప్ట్ చేయని నర్గీస్ ఫక్రీ.. రీసెంట్ గా ఇండియా వచ్చింది.

ఇలా మన దేశానికి రావడం నర్గీస్ కు కొత్తేమీ కాదు కానీ.. ఈ మధ్య కాలంలో సీక్రెట్ ట్రిప్పులు ఎక్కువగా వేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంత పెద్ద సెలబ్రిటీ భామకు రహస్యంగా ట్రిప్పులు వేయాల్సిన అవసరం ఏంటనేదే హాట్ టాపిక్. రీసెంట్ గా కూడా ఇండియా వచ్చిన ఈ భామ.. తన ముహం అంతా కప్పేసుకుని.. ఫోటోలకు దొరక్కుండా ఇలా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చింది. గత కొంత కాలంగా ఉదయ్ చోప్రాతో నర్గీస్ డేటింగ్ చేస్తోందనే టాక్ బాగానే నడుస్తోంది.

ఇప్పుడు కూడా ఉదయ్ చోప్రాతో డేట్ కోసమే ఇలా ఎవరికీ తెలియకుండా వచ్చిందన్నది బాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస. ఇంతకీ నర్గీస్-ఉదయ్ ల డేటింగ్ ఎంతవరకూ దారి తీస్తుందో తెలియదు కానీ.. ఆమె ఇక్కడకు.. ఇతను అమెరికాకి వేసే టూర్స్ కౌంట్ మాత్రం ఎక్కువగానే ఉంటోంది.


Tags:    

Similar News