చిత్రం : ‘నరుడా డోనరుడా’
నటీనటులు: సుమంత్ - పల్లవి సుభాష్ - తనికెళ్ల భరణి - శ్రీ లక్ష్మి - సుమన్ శెట్టి తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: షనీల్ డియో
కథ - స్క్రీన్ ప్లే: జుహి చతుర్వేది
మాటలు: కిట్టు విస్సాప్రగడ - సాగర్ రాచకొండ
నిర్మాతలు: సుప్రియ - సుధీర్ కుమార్ పూదోట
దర్శకత్వం: మల్లిక్ రామ్
చాలా ఏళ్లుగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న సుమంత్.. ఈసారి బాగా గ్యాప్ తీసుకుని ‘విక్కీ డోనర్’ రీమేక్ ‘నరుడా డోనరుడా’తో వచ్చాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి జనాల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
విక్రమ్ అలియా విక్కీ (సుమంత్) పనీపాటా లేకుండా తిరిగే కుర్రాడు. అతడి తల్లి స్వీటీ (శ్రీలక్ష్మి) నడిపే బ్యూటీ పార్లర్ మీద వచ్చే డబ్బులతోనే ఇల్లు గడుస్తుంటుంది. మరోవైపు ఫెర్టిలిటీ క్లినిక్ నడిపే డాక్టర్ సుబ్రమణ్యం (తనికెళ్ల భరణి) సరైన వీర్య దాత దొరక్క ఇబ్బంది పడుతుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ఆయన కళ్లు విక్కీ మీద పడతాయి. అతడి గురించి ఆరాలు తీసి.. అనేక రకాలుగా ప్రయత్నించి వీర్యదానానికి అతడి చేత ఒప్పిస్తాడు సుబ్రమణ్యం. మరి విక్కీ ఒప్పుకున్న ఈ పని వల్ల అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ప్రతి సినిమా మొదలవ్వడానికి ముందు సిగరెట్.. ఆల్కహాల్ తాగకండి అంటూ ఓ హెచ్చరిక రొటీన్ గా వినిపిస్తుంది. ఐతే ‘నరుడా డోనరుడా’ టైటిల్స్ పడే ముందు మాత్రం.. ‘‘సిగరెట్టు.. మందు తాగకండి. స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది’’ అంటూ తనికెళ్ల భరణి వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడే ఈ సినిమా ఎంత బోల్డుగా ఉండబోతోందో అర్థమైపోతుంది.
ప్రస్తుతం సమాజం ఎంత అడ్వాన్స్ అయినా.. కొన్ని విషయాల గురించి మనం బయటికి మాట్లాడం. ఓపెన్ గా డిస్కస్ చేసుకోవాల్సిన కొన్ని కీలకమైన విషయాల్ని మనసు లోతుల్లో దాచేస్తాం. సెక్స్.. స్పెర్మ్.. లాంటి పదాలు బహిరంగ వేదికల్లో అస్సలు వినిపించవు. సినిమాల్లో అయినా అంతే. ఐతే ఇలాంటి తరుణంలో వీర్యదానం నేపథ్యంలో హిందీలో వచ్చిన చక్కటి సినిమా ‘విక్కీ డోనర్’. ఓ మంచి విషయాన్ని చక్కటి కథ ద్వారా ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పిన ‘విక్కీ డోనర్’ను తెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నం మంచిదే కానీ.. దాన్ని సరైన రీతిలో తెలుగీకరించడంలో మాత్రం ‘నరుడా డోనరుడా’ టీం ఫెయిలైంది.
కొన్ని సినిమాలకు నేటివిటీ ఫ్యాక్టర్ అన్నది కీలకం అవుతుంది. ‘విక్కీ డోనర్’ ఆ కోవకు చెందిన సినిమానే. హిందీలో పంజాబీ కుర్రాడికి.. బెంగాలీ అమ్మాయికి మధ్య ప్రేమాయణం నడుస్తుంది. వాళ్లిద్దరి కల్చర్ల మీద చర్చ... ఆ నేపథ్యంలో సన్నివేశాలు సాగుతాయి. ఐతే తెలుగులోకి వచ్చేసరికి పంజాబీ హీరోను కాస్తా తెలుగు హీరోగా మార్చారు. బెంగాలీ అమ్మాయిని అలాగే ఉంచేశారు. దీంతో హిందీ వెర్షన్ కు చక్కగా కుదిరిన ప్రేమకథ.. తెలుగులోకి వచ్చేసరికి అసహజంగా కనిపిస్తుంది. ఇంకా మూల కథ దగ్గర్నుంచి చాలా అంశాల్ని మక్కీకి మక్కీ దించేయడం వల్ల ఇది నేటివిటీ మిస్సయిన జిరాక్స్ కాపీలాగా కనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్ కాబట్టి చేయి చేసుకుంటే వంటకం చెడిపోతుందనుకున్నారో ఏమిటో కానీ.. ‘నరుడా డోనరుడా’ మన సినిమా అన్న ఫీలింగ్ అయితే కలిగించదు. ఒరిజినల్ లోని సోల్.. ఫీల్.. ఇందులో మిస్సయ్యాయి.
‘నరుడా డోనరుడా’లో ప్రధాన పాత్రధారుల్లో ఒకరు ఫెర్టిలిటీ క్లినిక్ నడిపే డాక్టర్. ఇంకొకరు వీర్య దాత. ఇలాంటి ప్రధాన పాత్రలతో కథను నడిపించడం అంటే సాహసమే. హీరో వీర్యం పట్టడానికి బాటిల్ పట్టుకుని గది లోపలికి వెళ్లగానే ‘‘అర చేతుల్లో వైకుంఠం..’’ అంటూ ఓ పాట వస్తుంది. ఆ కార్యక్రమం పూర్వగానే బాటిల్ మూత తెరుచుకుని ప్రవాహం బయటికి వస్తున్న సింబాలిక్ షాట్ చూపిస్తారు.. హీరో వీర్యం ఇవ్వడం కుదరదని కోప్పడితే డాక్టర్.. ‘‘ఉరమకయ్యా.. వర్షించవయ్యా’’ అంటాడు.. ఇలాంటి సన్నివేశాల్ని.. మాటల్ని ఎంజాయ్ చేసే మెచ్యూరిటీ.. టేస్టు ఉంటే ఆ రకంగా ‘నరుడా డోనరుడా’ను కొంత వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఐతే ఈ ఎంటర్టైన్మెంట్ ఓ దశ దాటిన తర్వాత రొటీన్ అనిపిస్తుంది. వీర్య దానం నేపథ్యంలో హిందీలో హాస్యం సున్నితంగా సాగితే.. తెలుగులోకి వచ్చేసరికి కొంచెం నాటుగా చూపించారు. అలాంటి సన్నివేశాల్ని అందరూ జీర్ణించుకోలేరు.
ప్రథమార్ధంలో వచ్చే అడల్ట్ కామెడీ ఓ వర్గానికి నచ్చినా.. సగటు ప్రేక్షకుడు మాత్రం దాన్ని ఎంత వరకు ఎంజాయ్ చేస్తారన్నది సందేహమే. ద్వితీయార్ధంలో హీరో హీరోయిన్ల పెళ్లి తర్వాత కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. హీరోయిన్ హీరోను అపార్థం చేసుకుని వెళ్లిపోయే సన్నివేశాన్ని ఇంకాస్త కన్విన్సింగ్ గా తీర్చిదిద్దాల్సింది. ఐతే ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ మాత్రం బాగానే అనిపిస్తుంది. తనికెళ్ల భరణి తన అనుభవంతో ఈ సన్నివేశానికి బలంగా నిలిచారు. ఓవరాల్ గా ‘నరుడా డోనరుడా’ మిశ్రమానుభూతులతో ముగుస్తుంది. కాన్సెప్ట్ పరంగా కొత్తదే అయినా.. తెలుగులోకి వచ్చేసరికి డోనరుడు దారి తప్పాడు. దాదాపుగా ఒరిజినల్ కు జిరాక్స్ కాపీలా ఉన్నా.. అది తెచ్చిన ఫీలింగ్ తెలుగు వెర్షన్ తేలేకపోయింది. అసలు ఈ కాన్సెప్టును మన ప్రేక్షకులు ఏమాత్రం జీర్ణించుకుంటారన్నదీ సందేహమే.
నటీనటులు:
సుమంత్ కెరీర్లో అల్లరి పాత్రలు అరుదు. ఎక్కువగా సీరియస్.. హుందాగా ఉండే క్యారెక్టర్లే చేశాడు. ఐతే ఈ సినిమాలో అల్లరి కుర్రాడిగా కొత్తగా కనిపిస్తాడు. ప్రథమార్ధంలో సుమంత్ కొన్ని చోట్ల నవ్వించడంలో విజయవంతమయ్యాడు కానీ.. కొన్ని చోట్ల మరీ అతిగా నటించేశాడు. ద్వితీయార్ధంలో పాత్ర ఎమోషనల్ గా మారాక ఒరిజినల్ సుమంత్ కనిపిస్తాడు. సినిమాలో అందరికంటే బాగా ఆకట్టుకునేది తనికెళ్ల భరణినే. హిందీలో అన్ను కపూర్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాత్రకు భరణి మంచి ఛాయిస్. ఆయన పాత్రకు మంచి డైలాగులు పడ్డాయి. హీరోయిన్ పల్లవి సుభాష్ పర్వాలేదు. ఆమె గ్లామర్ పరంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. నటన మాత్రం బాగానే ఉంది. హిందీ వెర్షన్ లో యామి గౌతమ్ మంచి పేరు తెచుకొన్నది ఆమె ల మెప్పించ లేకపోయింది. శ్రీలక్ష్మి.. సుమన్ శెట్టి పాత్రలకు తగట్లు నటించారు.
సాంకేతికవర్గం:
శ్రీ చరణ్ పాకాల పాటల్లో రెండు బాగున్నాయి. ద్వితీయార్ధంలో ఎమోషనల్ పార్ట్ నడిచే సమయంలో వచ్చే పాట.. ఆ ఎపిసోడ్ అంతటా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. షనీల్ డియో ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువల విషయంలోనే బాగా రాజీ పడ్డ సంగతి స్పస్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ తో పాటు సాంకేతిక ఆకర్షణల విషయంలోనూ రాజీ పడ్డారు. మాటల రచయితలు కిట్టు.. సాగర్ డైలాగ్స్ విషయంలో హద్దులేమీ పెట్టుకోకుండా రెచ్చిపోయి రాసేశారు. వాళ్ల పెన్ను కొన్ని చోట్ల శ్రుతి మించింది. ఇక దర్శకుడు మల్లిక్ రామ్ తన ముద్ర చూపించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. హిందీ నుంచి తెచ్చుకున్న కథాకథనాల్లో మార్పులేమీ చేయలేదు. దాదాపుగా ఒరిజినల్నే ఫాలో అయిపోయాడు. కానీ ఒరిజినల్ ఇచ్చిన ఫీల్ ను తెలుగులో తీసుకురాలేకపోయాడు.
చివరగా: డోనరుడా.. స్ట్రైక్ రేట్ బాలేదయ్యా!
రేటింగ్: 2.25/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre