షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లు.. దర్శకుడికి ఉండే ట్రీట్మెంట్ వేరు. మిగతా వాళ్లకుండే ట్రీట్మెంట్ వేరు. సినిమాకు కీలకమైన వాళ్లను 5 స్టార్ హోటళ్లలో పెడతారు. మిగతా వాళ్లకు వాళ్ల స్థాయికి తగ్గ హోటళ్లలో పెడతారు. షూటింగ్ స్పాట్లో కూడా ఏర్పాట్లు నటీనటుల స్థాయికి తగ్గట్లే ఉంటాయి. హీరో హీరోయిన్లకు కారవాన్లు పెట్టి.. మిగతా వాళ్లకు మామూలు ఏర్పాట్లే చేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది.. ఎవరినెలా ట్రీట్ చేస్తారన్నది బయటి జనాలకు తెలియదు. ఐతే ట్రీట్మెంట్ విషయంలో ప్రొడక్షన్ వాళ్లు చూపించే తారతమ్యాల విషయంలో కొందరు ఆగ్రహంగా ఉంటారు. కొందరు లైట్ తీసుకుంటారు. సీనియర్ నటుడు నాజర్ కు ఇలాంటి విషయాల్లో కొన్ని చేదు అనుభవాలు లేకపోలేదట. ఒకసారి తనను ఏసీ కారు నుంచి దించేసిన అనుభవం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు నాజర్.
నాజర్: ‘నాయకుడు’ ముందు హ్యాపీగా ఉండేవాడ్ని. ‘నాయకుడు’ వచ్చిన తర్వాత శ్వాసతీసుకోవటానికి టైం లేదు. అంత బిజీగా అయ్యాను. చిన్న ఏజ్ లో వరుసగా 72 గంటలు కంటిన్యూగా పనిచేశాను. మొత్తానికి ఎటుపోతున్నామో అర్థం అయ్యేది కాదు. ఎవరైనా వచ్చి ‘మీకు ఈ క్యారెక్టర్ తెలీదా.. ఏదోటి చేయండి’ అని అడిగేవారు. నేనేమైనా మ్యాజిక్ చేస్తానా అనేవాడ్ని.
‘‘ఐదేళ్ల కితం ఏవీఎం స్టూడియో షూటింగ్ లో పాల్గొంటున్నాను. ఆ రోజు నేను నా సొంత కారు తీసుకెళ్లలేదు. ప్రొడక్షన్ మేనేజర్ని అడిగితే ఒక కారు చూపించి అందులో కూర్చోమన్నారు. నేను అందులో కూర్చుని పుస్తకం చదువుతున్నా. అంతలో వేరే మేనేజర్ వచ్చి అది ఏసీ కారని.. హీరోయిన్ కోసం తెచ్చామని.. నన్ను వేరే కార్లో కూర్చోమని చెప్పాను. నేను పర్లేదని చెప్పి దిగేశాను. అంతలో నన్ను అంతకుముందు ఆ కార్లో కూర్చోబెట్టిన మేనేజర్ వచ్చారు. నన్ను ఆ కార్లోంచి దింపేసినందుకు ఇంకో మేనేజర్ ను అరిచాడు. నేను వదిలేయమన్నాను. ఇలాంటివి మామూలే. మేం ఎలాంటి స్థితినైనా తట్టుకునేలా మా గురువుగారైన బాలచందర్ గారు తీర్చిదిద్దారు. పరిశ్రమలో ఒక సిస్టం ఉంటే దాని ప్రకారం మనం నడవాలంతే’’ అన్నాడు నాజర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/