నాజర్ సార్ కు ఏమైంది?

Update: 2015-09-16 07:45 GMT
తమిళ, తెలుగు భాషల్లో గొప్ప పేరు సంపాదించిన నటుడు నాజర్. ఈ బహుముఖ ప్రజ్ణాశాలి మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం ఆయన అభిమానుల్ని కలవర పరుస్తోంది. ఆయనకు ఏమైందన్నది ఎవరూ చెప్పడం లేదు. ఐతే ఏదో పెద్ద అనారోగ్యమే అంటూ కోలీవుడ్లో వదంతులు వ్యాపించడంతో అందరిలోనూ కంగారు నెలకొంది. చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఓ ప్రెవేట్ హాస్పటిల్లో నాజర్ కు చికిత్స అందిస్తున్నారు. నాజర్ కు గుండెపోటు వచ్చిందని కొందరు అంటున్నారు. ఐతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. నాజర్ భార్య కమల మాట్లాడుతూ... తన భర్త కొన్ని ఆరోగ్య పరీక్షలు కోసం ఆసుపత్రిలో చేరారని.. అవి పూర్తి కాగానే ఇంటికి వచ్చేస్తారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.

నాజర్ కొన్నాళ్లుగా బాగా ఒత్తిడికి గురవుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కొన్ని నెలల కిందట ఆయన చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డా అతనింకా పూర్తిగా కోలుకోలేదు.  మరోవైపు నడిగర్ సంఘం ఎన్నికల టెన్షన్ కూడా ఆయన్ని ఆందోళనకు గురి చేస్తోంది. విశాల్ తో కలిసి కొండలాంటి శరత్ కుమార్ వర్గాన్ని ఢీకొడుతున్నారాయన. విశాల్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుంటే నాజర్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నాజర్ ఒత్తిడికి గురై.. అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా నాజర్ లాంటి మంచి నటుడు త్వరగా కోలుకుని.. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. నాజర్ వచ్చే నెలలో బాహుబలి-2 షూటింగుకి హాజరవ్వాల్సి ఉంది.
Tags:    

Similar News