దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా సంచలన నిర్ణయాన్నితీసుకుంది. ఇకపై.. సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పనిసరి చేయాలని చెప్పింది. సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభంలో జనగణమణ తర్వాతే సినిమాను వేయాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని.. జాతీయ పతాకాన్ని గౌరవించాలని చెప్పింది.
జాతీయ గీతాన్ని ప్రదర్శించటం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇకపై సినిమా స్టార్టింగ్ లో జాతీయ గీతాలాపనతో సినిమా ప్రదర్శన ప్రారంభం కానుంది. ‘దేశంలోని ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని.. జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొంటూ తాజా ఆదేశాలు జారీ చేసింది. అదేసమయంలో జాతీయ గీతాన్ని యథాతధంగా వినియోగించాలే కానీ.. మార్పులు చేర్పులు చేయరాదని చెప్పింది.
భోపాల్ కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన శ్యామ్ నారాయణ చౌస్కీ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సంచలన ఆదేశాల్ని జారీ చేసింది. వాస్తవానికి 1960ల వరకూ సినిమా తర్వాత జాతీయగీతాన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శించేవారు. అయితే.. 1990తర్వాత ఈ పద్దతిని ఎవరూ పాటించట్లేదు. ఇదిలా ఉంటే2003లోమహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/