బెల్లంకొండ బ్రదర్ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్..!

Update: 2022-10-18 06:28 GMT
నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. డెబ్యూ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గణేష్.. ఇప్పుడు ''నేను స్టూడెంట్ సర్!'' అంటూ వస్తున్నాడు.

'నేను స్టూడెంట్ సర్!' అనేది డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో రూపొందే ఒక స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుస్తోంది. ఇటీవలే టైటిల్‌ అనౌన్స్ చేసిన మేకర్స్.. ప్రత్యేకమైన పోస్టర్ల ద్వారా చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు.

ఇప్పటికే హీరో హీరోయిన్లు గణేష్ మరియు అవంతిక దాసాని యొక్క ఫస్ట్ లుక్‌ లను ఆవిష్కరించారు. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విలక్షణ నటుడు సముద్రఖని ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు.

'నేను స్టూడెంట్ సర్!' సినిమాలో అర్జున్ వాసుదేవన్‌ గా సముద్రఖని కనిపించనున్నారు. పాత్ర పేరు సూచించినట్లుగా, అతను శృతి వాసుదేవన్ (అవంతిక) తండ్రి అని తెలుస్తోంది. అంతేకాదు అతనొక పోలీసాఫీసర్ గా ఉన్నాడు.

ఫస్ట్ లుక్ లో సముద్రఖని వెనుక పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ ఉండగా.. అతను గంభీరమైన ముఖంతో రోడ్డుపై నడుస్తూ ఉన్నాడు. జాతీయ ఉత్తమ నటుడు ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో సునీల్ మరో ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. శ్రీకాంత్ అయ్యంగార్ - ఆటో రాంప్రసాద్ - చరణ్‌ దీప్ - ప్రమోధిని - రవి శివతేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి 'నేను స్టూడెంట్ సర్!' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నంబర్-2 గా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన 'నాంది' మాదిరిగానే ఇది కూడా యూనిక్ సబ్జెక్ట్ తో కూడిన కంటెంట్ రిచ్ మూవీ అని ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథను అందించాడు

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అనిత్ మధాడి సినిమాటోగ్రఫీ అందించగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'నేను స్టూడెంట్ సార్!' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News