జాతీయ అవార్డుల్ని ప్రకటించినపుడల్లా కొందరు హర్షం ప్రకటించడం.. ఇంకొందరు అసంతృప్తి వ్యక్తం చేయడం మామూలే. అవార్డులు ఆశించిన నిరాశకు గురైన వాళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు. ఐతే అవార్డులేమీ ఆశించకుండానే ఒక ప్రముఖ దర్శకుడు అవార్డుల తీరుపై విమర్శలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమవుతోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. మురుగదాస్. మహేష్ బాబుతో సినిమా తీస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ జాతీయ అవార్డుల జ్యూరీపై విమర్శలు గుప్పించాడు. అవార్డుల ఎంపికలో పక్షపాతంతో వ్యవహరించారని ట్వీట్ చేశాడు. జ్యూరీలో ఉన్న వాళ్ల ఇన్ ఫ్లూయెన్స్.. వాళ్ల పక్షపాతం అవార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోందని.. ఇవి ఏకపక్షంగా ఇచ్చిన అవార్డులని మురుగదాస్ తేల్చేశాడు.
మురుగదాస్ టార్గెట్ జ్యూరీకి నేతృత్వం వహించిన ప్రియదర్శనే అని అంతా అంటున్నారు. ఆయన తనకు నచ్చిన హీరోలకు అవార్డులిచ్చుకున్నాడని ఆల్రెడీ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రియదర్శన్ తో చాలా సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ కు ఉత్తమ నటుడి అవార్డు దక్కగా.. ప్రియదర్శన్ కు అత్యంత ఆప్తుడే కాక ఆయనతో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన మోహన్ లాల్ కు ప్రత్యేక జ్యూరీ పురస్కారం దక్కింది. అంతే కాక కొన్ని మలయాళ సినిమాలకు కూడా ఎక్కువ అవార్డులొచ్చాయి. దీనిపై బాలీవుడ్ వాళ్లే విమర్శలు గుప్పిస్తుండగా.. వారికి మురుగదాస్ తోడవడం విశేషం. గత ఏడాది మురుగదాస్ నుంచి వచ్చిన సినిమా ‘అకీరా’ మాత్రమే. అది రీమేక్ కాబట్టి ఆయనేమీ అవార్డులు ఆశించలేదు. అయినా మురుగదాస్ గళం విప్పాడంటే.. జాతీయ అవార్డుల ఎంపిక విషయంలో జెన్యూన్ గానే మురుగదాస్ ఫీలయ్యాడన్నమాటే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/