#దిశ‌.. వివాదం స‌రేలే.. నిర్భ‌యంగా చూపించామన్నాడు!

Update: 2020-10-10 17:00 GMT
వివాదంతో ప్ర‌చారం ఆర్జీవీ స్టైల్. ఆయ‌న ప‌లువురు నిర్మాత‌ల‌తో యువ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో క‌లిసి సినిమాలు తెర‌కెక్కిస్తూ వాటికి ప్ర‌మోష‌న్ చేస్తున్న తీరు ఆసక్తిక‌రం. ఆయన మార్గ‌నిర్ధేశ‌నంలో వివాదం పురుడుపోసుకోవ‌డ‌మే గాక దానికి ప్ర‌చారార్భాటం పీక్స్ కి చేరుతుంది. అలా ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌కు మంచి ప్ర‌మోష‌న్ ద‌క్కింది.

ప్ర‌స్తుతం ఆర్జీవీ దిశా నిర్ధేశ‌నంలో న‌ట్టికుమార్ నిర్మించిన `దిశ ఎన్ కౌంట‌ర్` సినిమాకి అదే తీరుగా ప్ర‌చారం ద‌క్కుతోంది. ఈ సినిమా రిలీజ్ ని ఆపాలంటూ దిశ తండ్రి కోర్టును ఆశ్ర‌యించ‌డంతో దీనికి నిర్మాత ఆన్స‌ర్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి తలెత్తింది. అయితే న‌ట్టి కుమార్ మాట్లాడుతూ.. మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు మళ్ళీ జరగకూడదని చట్టానికి .. న్యాయానికి లోబడి ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌కుండానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. నవంబర్ 26 న దిశ ఎన్ కౌంటర్ చిత్రం రీలీజ్ చేస్తున్నామని తెలిపారు. కోర్టు ఎలా తీర్పు ఇస్తే త‌ద‌నుగుణంగా నడుచుకుంటామన్నారు.

అయినా సినిమాని సినిమాలా చూడాల‌ని ప్రేక్ష‌కుల్ని కోరారు. ఎవ‌రి మ‌నోభావాల్ని కించ‌ప‌ర‌చ‌మ‌ని అన్నారు. సెన్సార్ బోర్డ్ ఇంకా మాకు ఎలాంటి సర్ట్ఫికెట్ ఇవ్వలేదని..దిశ కమిషన్ కు సంబంధించిన విషయాలు చిత్రం లో ఏమి చెప్పలేదని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. 50 నిమిషాల నిడివి సినిమాలో నిజాల్ని నిర్భ‌యంగా చూపిస్తున్నామ‌ని తెలిపారు. ఆర్జీవీ వ‌చ్చాక పూర్తి వివ‌రాలు చెబుతాన‌ని ఎవ‌రి కామెంట్ల‌కు స్పందించ‌మ‌ని న‌ట్టి అన్నారు.
Tags:    

Similar News