గత కొన్ని రోజులుగా ఆర్థిక లావాదేవీల పరంగా, సినిమా బడ్జెట్ ప్యాకేజీల పరంగా రామ్ గోపాల్ వర్మ చుట్టూ వివాదం అలుముకుంటున్న విషయం తెలిసిందే. తమని వర్మ నమ్మించి మోసం చేశారని, 50 లక్షలు ఇస్తే తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని శేఖర్ రాజు అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు పెట్టారు.
ఈ విషయాన్ని ముందే వెల్లడించిన నట్టికుమార్ తనని కూడా వర్మ మోసం చేశారని, ఇంత వరకు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని నట్టికుమార్ కూడా వర్మపై సంచలన ఆరోపణలు చేశారు.
తాజాగా నట్టికుమార్ కు షాకిస్తూ తన సంతకాన్ని ఫోర్జీరీ చేశారని, తప్పుడు పత్రాలు సృష్టించి తనని అడ్డంగా మోసం చేశారంటూ రామ్ గోపాల్ వర్మ నిర్మాతలు నట్టికుమార్, నట్టి క్రాంతిలపై పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లో శనివారం కేసు పెట్టారు. ఉన్నట్టుండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన వర్మ .. నట్టికుమార్, నట్టి క్రాంతిలపై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై నట్టికుమార్ స్ట్రాంగ్ గా వర్మకు కౌంటర్ ఇచ్చారు.
ఆర్జీవీ డైరెక్ట్ చేసిన 'డేంజరస్' మూవీని తెలుగులో 'మా ఇష్టం' పేరుతో ఏప్రిల్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే నట్టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంసకథకు చెందిన నట్టి క్రాంతి, నట్టి కరుణ లు ఆర్జీవి తమకు డబ్బులు ఇవ్వాలని, ఇవ్వకుండా మూవీని విడుదల చేస్తున్నారంటూ కోర్టుని ఆశ్రయించారు. దీంతో స్టే విధించిన కోర్టు సినిమా విడుదలని నిలిపివేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆర్జీవి తాజాగా పంజా గుట్ట పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. నట్టి క్రాంతి, కరుణలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై నట్టికుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ ఓ 420 అని, అతను తన పిల్లలపై తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పిల్లల జోలికి వచ్చే ఆర్జీవీని వదిలిపెట్టనని, ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తోందని, ఆర్జీవీ జీరో అయిపోయాడని, తనని అసలు వదిలి పెట్టనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వివాదం తేలేవరకు తాను సుప్రీం కోర్టుకు అయినా వెళతానని స్పష్టం చేశారు. తనకు ఆర్జీవి డబ్బులు కట్టేవరకు తన సినిమాలు రిలీజ్ కానివ్వనన్నారు.
ఆర్జీవీ మాయ మాటలు నమ్మి చాలా మంది మోసపోతున్నారని. మీడియా నా పిల్లలపై అటెన్షన్ క్రియేట్ చేయాలని నా పిల్లలపై కేసు పెట్టాడు ఆర్జీవి. అందరినీ ఏకం చేసి ఆర్జీవీ సినిమాలను విడుదల చేయకుండా చేస్తామని, పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు తమకు రాలేదన్నారు. వాళ్లు ఎలాంటి వివరాలు అడిగినా అందజేస్తాం అన్నారు నట్టి కుమార్. విచారణ కు సహకరిస్తామని, ప్రొడ్యూసర్లు ఎవరూ కూడా ఆర్జీవీతో సినిమాలు తీయొద్దని తెలిపారు. దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.