టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ తమన్. టాలీవుడ్ లో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతూ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. `అల వైకుంఠపురములో` ఆల్బమ్‌తో తమన్ పేరు ఓ రేంజ్ లో మారు మోగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే హవాని కొనసాగిస్తున్నాడు. ఇటీవల `అఖండ`తో ఆఖండమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని `సర్కారు వారి పాట`, భీమ్లా నాయక్ వంటి చిత్రాలకు ఎక్స్‌లెంట్ సంగీతం అందించిన అబ్బురపరుస్తున్నాడు.
`రాధేశ్యామ్` చిత్రానికి కూడా తమన్ నేపథ్య సంగీతం అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన `అఖండ`కు బాలయ్య పెర్ఫార్మెన్స్ తో పాటు తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఇదే విషయం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ లోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. సంగీతం విషయంలోనూ.. ఇతర విషయాల్లోనూ చాలా కూల్‌గా వుండే తమన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
అన్ని క్రాఫ్ట్ లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా దేనినీ డామినేట్ చేయదని, డైలాగ్ డెప్త్ ని తెలుసుకోవడం, తదుపరి సన్నివేశాల్లోకి ప్రేక్షకుల్ని స్మూత్ తీనం చేయడం అనేది సినిమాఉ సంబంధించి ఒక లోతైన అవగాహన. కాబట్టి విజువలైజేషన్ లేకుండా గొప్ప క్యారెక్టరైజేషన్ లను రూపొందించడం, నిజమైన భావోద్వేగాలతో చక్కగా వ్రాసిన స్క్రిప్ట్‌లు సరైన వేగంతో వివరించబడ్డాయి. గొప్పగా దర్శకత్వం వహించబడినప్పుడే కళాకారుల నుంచి అద్భుతమైన ప్రదర్శనలు వస్తాయి. ఇది అన్ని శాఖలు సమంగా పని చేసినప్పుడే జరుగుతుంది కానీ ఇది వన్ మ్యాన్ షో ఎంత మాత్రం కాదు` అని తమన్ ట్వీట్ చేసిన తీరు సంచలనంగా మారింది.
ఇంతకీ తమన్ ఎవరిని ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారని కొంత మంది ఆరా తీస్తుంటే మరి కొంత మంది మాత్రం నేచురల్ స్టార్ నానిని ఉద్దేశించి తమన్ ఇలా ట్వీట్ చేశాడని చెప్పుకుంటున్నారు. ఇంతకీ నానికి, తమన్ కి మధ్య ఏం జరిగింది?.. వీరిద్దరి మధ్య ఎందుకు చెడింది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాని `శ్యామ్ సింగ రాయ్` సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన సినిమాలోని సంగీతం అన్ని విభాగాల్లాగే ప్రాధాన్యత పరంగా సమానంగా వుందని, మ్యూజిక్ లేదా బీజీఎమ్ ఏ ఇదర విభాగాలను డామినేట్ చేయలేదని చెప్పాడు.
అంతే కాకుండా సంగీతం సినిమాని ఎలివేట్ చేయాలి తప్ప డామినేట్ చేయకూడదు. సంగీతం, బీజిఎమ్, సినిమాటోగ్రఫీ వంటి అన్ని విభాగాలు ఒకేతాటిపై పనిచేయాలి. లేదంటే సినిమా శృతి తప్పుతుంది అని నాని కామెంట్ చేశాడు. ఇలా ఎందుకు మాట్లాడారన్నది తమన్ ట్వీట్ తో క్లారిటీ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య `టక్ జగదీష్` విషయంలో మనస్పర్థలు తలెత్తాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాలి. కానీ అతనిచ్చిన నేపథ్య సంగీతం నానికి నచ్చలేదు. దాంతో అతన్ని తప్పించి గోపీ సుందర్‌కు ఆ బాధ్యతల్ని అప్పగించాడు నాని అక్కడే ఇద్దరి మధ్య గొడవకు బీజం పడిందని, ఇప్పుడు అది ట్విట్టర్ కెక్కిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
మరి తమన్ తాజా ట్వీట్ లపై నాని స్పందిస్తాడా? .. ఇంతకీ తమన్ ట్వీట్ చేసింది నాని గురించేనా... `శ్యామ్ సింగ రాయ్` ప్రచార కార్యక్రమంలో హీరో నాని అన్న మాటలు తమన్ ని ఉద్దేశించి చేసిన వేనా?.. అతన్ని టార్గెట్ చేయడం కోసమే నాని అన్ని విభాగాలు సమానంగా పని చేస్తేనే సినిమా శృతి తప్పదని, లేదంటే శృతి తప్పుతుందని కామెంట్ చేశారా? అన్నది క్లారిటీ రావాలంటే తమన్ ట్వీట్ లపై నేచురల్ స్టార్ నాని స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు నెటిజన్స్.