కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన తంగమగన్ ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా.. ఇక్కడ నవ మన్మధుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ రైట్స్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తెలుగువెర్షన్ కి సంబంధించిన హక్కులను 1.8 కోట్లకు విక్రయించారు. ధనుష్ హీరోగా చేసిన ఈ మూవీలో.. లీడ్ హీరోయిన్ సమంత. మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ చేసింది. మరోవైపు ఇంతకుముందు ధనుష్ ఇదే డైరెక్టర్ వేల్ రాజ్ తీసిన వీఐపీ(తెలుగులో రఘువరన్ బీటెక్) ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కనీసం రెండు కోట్లు కూడా డబ్బింగ్ రైట్స్ పలకకపోవడం ఆశ్చర్యకరం.
తెలుగులో సమంత క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం సమంత ఉండడంతో అయినా.. మంచి రేట్ వస్తుందనే అంచనాలున్నా.. ఇవి కూడా నెరవేరలేదు. ఒకవేళ మూవీకి ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా, తెలుగు నిర్మాతలకు కాసుల పంట పండినట్లే. అయితే.. వరుణ్ తేజ్ లోఫర్ తో పాటు - దిల్ వాలే - బాజీరావు మస్తానీ వంటి బాలీవుడ్ బడా మూవీస్ తో నవ మన్మధుడు పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఇంత పోటీలో ఈ కోలీవుడ్ స్టార్ ఎలా నెగ్గుతాడో?