సినిమా టిక్కెట్ పై న‌వ‌దీప్ ట‌మోటా సెటైర్

Update: 2021-11-29 03:24 GMT
ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ అసెంబ్లీలో బిల్లు అమోదించిన సంగతి తెలిసిందే. ఏ హీరో సినిమా టిక్కెట్ అయినా స‌రే ఒకే ధ‌ర‌కు విక్ర‌యించాల‌ని...చిన్న సినిమా..పెద్ద సినిమా అనే తార‌త‌మ్యం లేకుండా ఏ సినిమా అయిన ఒక్క‌టేన‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

దీనిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వానికి అనుకూలంగాను..ప్ర‌తికూలంగాను కామెంట్లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వం నిర్ధారించిన ధ‌ర‌లతో న‌ష్టం సినిమా ఇండ‌స్ర్టీకే కావ‌డంతో అటువైపు నుంచి ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ప్ర‌భుత్వ పెద్ద‌లు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై పునరాలోచించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు.

ఇక ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అయితే త‌న‌దైన శైలిలో స్పందించారు. పెట్రోలు..డీజిల్..నిత్యావ‌స‌రాలు ధ‌ర‌లు మాత్రం పెరుగుతాయి. సినిమా టిక్కెట్ ధ‌ర‌లను మాత్రం పెంచ‌క‌పోవ‌డం విడ్డూరం అంటూ స్పందించారు. తాజాగా న‌టుడు న‌వ‌దీప్ కూడా ప్ర‌భుత్వం పై వ్య‌గ్యంగా స్పందించారు.

`సినిమా టిక్కెట్ వ‌ర్సెస్ ట‌మోటా ` అని ట్వీట్ చేసారు. కొన్ని రోజులు గా తెలుగు రాష్ర్టాల్లో ట‌మోటా స‌ర‌ఫ‌రా కొర‌త కార‌ణంగా ధ‌ర‌లు ఆకాశ‌న్నంటుతోన్న సంగ‌తి తెలిసిందే. కానీ సినిమా టెక్కెట్ ధ‌ర మాత్రం పెంచ‌ర‌ని స్పందించారు.

ఏపీ ప్ర‌భ‌త్వం తీరుపై టాలీవుడ్ పెద్ద‌లు చాలా మంది మౌనంగానే ఉన్నారు. ప్ర‌భుత్వంతో పెట్టుకుంటే ప‌రిస్థితులు భ‌విష్య‌త్ లో మ‌రింత ఇబ్బంది క‌రంగా మారుతుంది అన్న కార‌ణంగానే చాలా మంది స్పందించ‌లేదు. చిరంజీవి..సురేష్ బాబు లాంటి వారు మాత్ర‌మే స్పందించారు.

కేవ‌లం నాలుగు షోల‌కు మాత్ర‌మే అనుమతిచ్చారు. టిక్కెట్లు ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ద్వారా అమ్మ‌కాలు జ‌రుగుతాయి. బ్లాక్ మార్కెటింగ్ ని అరిక‌ట్ట‌డం..తొలివారంలో స్టార్ హీరోలు అధికంగా వ‌సూళ్లు చేసే బాదుడు నుంచి సినీ ప్రేక్ష‌కుడుకి ఊర‌ట ల‌భించింద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

Tags:    

Similar News