మీడియం రేంజ్ సినిమాలకు ఓటీటీ వరంగా మారిన సంగతి తెలిసిందే. కంటెంట్ పై నమ్మకం ఉన్నా లేకపోయినా ఓటీటీలు నిర్మాతలకి గిట్టుబాటయ్యే సొమ్ములిచ్చి కొనుగోలు చేస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ ని మించి ఓటీటీ రిలీజ్ నే ఉత్తమం.. ఇప్పటికే కొన్ని సినిమాలు రుజువు చేసాయి. ఓటీటీ రిలీజ్ అనేది నిర్మాతలకు సేఫ్ జోన్ లా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ కే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్ 25న కొన్ని సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. దాంతో పాటే నవంబర్ 26న యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తోన్న `బ్రో` సినిమా కూడా రిలీజ్ అవుతోంది.
ఇందులో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇది అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ స్టోరీతో తెరకెక్కిన మూవీ. బ్రదర్..సిస్టర్ మధ్య నడిచే ఎమోషన్ హైలైట్ అయింది. అన్నా చెల్లెళ్ల మధ్య సరదా సన్నివేశాలు... తీపిజ్ఞాపకాలు ఇవన్నీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
స్వచ్ఛమైన అన్నా చెల్లి బంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తోంది. బాల్యంలో చెల్లితో గడిపిన క్షణాలు..పెద్దయిన తర్వాత చదువు.. జాబ్ అంటూ బయట ఉండటం.. ఈ క్రమంలో చెల్లిని మిస్ అవ్వడం వంటి ఎమోషన్ బాగుంది. సినిమా లో క్లాస్ టచ్ కనిపిస్తోంది. కాస్త విభిన్నంగాను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి.
రిలీజ్ అయితే గానీ సినిమాలో మ్యాటర్ ఎంత అన్నది తేలదు. నవీన్ చంద్ర లవర్ బోయ్ గా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. `అందాల రాక్షసి` నవీన్ కి మంచి గుర్తింపు ను తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత నటించిన కొన్ని చిత్రాలు అంతగా సక్సెస్ కాలేదు. అలాగే కొన్ని చిత్రాల్లో విలన్ గాను నటించాడు. ఆ తరహా పాత్రలకు బాగా సెట్ అయ్యాడు. ఇలా నవీన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.
Full View