టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా అరంగేట్రం చేసాడు నవీన్ పొలిశెట్టి. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న నవీన్ తెలుగులో రెండో సినిమాతో సిద్ధమయ్యాడు. మార్చ్ 11న నవీన్ నటించిన 'జాతిరత్నాలు' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా నవీన్ జాతిరత్నాలు సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. అవేంటో చూద్దాం!
*ఏజెంట్ సక్సెస్ తర్వాత ఎలాంటి మూవీ చేయాలనుకున్నారు?
నిజానికి ఏజెంట్ మూవీ తర్వాత వెంటనే హిందీలో చిచ్చోరే సినిమా చేసాను. ఈ రెండు నాకు మంచిపేరు తీసుకొచ్చాయి. అయితే నెక్స్ట్ సినిమా ఆడియన్స్ అంచనాలను రీచ్ అయ్యేలా ఉండాలని అనుకున్నాను.
*రెండు హిట్స్ పడేసరికి ఎలా ఫీలయ్యారు. జాతిరత్నాలు అవకాశం ఎలా వచ్చింది?
నిజానికి చాలా ప్రెజర్ ఫీలయ్యాను. ఏజెంట్ షూటింగ్ సమయంలో ఓరోజు నాగ్ అశ్విన్ ఫోన్ చేశారు. `మంచికథ విన్నాను. మీకు సూట్ అవుతుందని అనుకుంటున్నా. ఒకసారి వినండి` అన్నారు. అయితే వెళ్లి డైరెక్టర్ అనుదీప్ ను కలిసి ఫుల్ నేరేషన్ విన్నాను. నాకు లైన్ వినగానే నచ్చేసింది. ఓకే అనేశా. నాకు కావాల్సింది కూడా ఇలాంటి కథే అనిపించింది. ఎందుకంటే… ఏజెంట్ పాత్ర నన్ను చాలా పాపులర్ ని చేసింది. ఎక్కడికెళ్లినా `ఏజెంట్..` అని పిలవడం మొదలెట్టారు. అందులోంచి బయటకు రావడానికి జాతిరత్నాలు చాలా ఉపయోపడుతుంది. ఇప్పుడు నుంచి కొంతకాలం నన్ను జోగిపేట శ్రీకాంత్ అని పిలుస్తారు.
* ఈ సినిమాలో ముగ్గురు హీరోలు కనిపిస్తున్నారు?
కథే హీరో అండీ. అదే మమ్మల్ని నడిపించింది. కథలో మేమంతా భాగం అంతే. కథతో పాటే మేము.
*జాతిరత్నాలు అంటే ఏంటి.. ఆ టైటిల్ ఎలా పెట్టారు?
జాతి రత్నాలు.. అంటే ఏదో అనుకోకండి. చాలా సెటైరికల్ గా పెట్టిన టైటిల్ ఇది. ఫ్రీడమ్ ఫైటర్స్.. సొసైటీకి మంచిపని చేసినవాళ్లని జాతిరత్నాలు అని పిలుస్తారు. మాకంతలేదు… కేవలం సెటైరికల్ గా పెట్టాము. సెట్లో ఎవరైనా పని సరిగా చేయలేకపోయారంటే.. `వచ్చాడ్రా జాతి రత్నం ` అనడం మొదలెట్టాం. మేం ముగ్గురం అదే టైపు.
*ఈ సినిమాకు అసలు జాతిరత్నాలు ఎవరు?
నిజం చెప్పాలంటే మా నిర్మాతలు స్వప్న, నాగ్ అశ్విన్. ఎందుకంటే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేని నాలాంటి హీరోతో సినిమా చేయడమే గొప్పవిషయం. ప్రతీ ఇంట్లోనూ ఓ నవీన్ ఉంటాడు. వాడిలో ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. అయినా సరే.. ఇంట్లో వాళ్లు `వద్దురా బాబూ.. మనకెందుకు ఇవన్నీ` అంటుంటారు. అలా చెప్పడం ఆపాలంటే మీ ప్రతిభకు సరైన వేదిక ఉంది అనే ధైర్యం కావాలి. అవి ఇలాంటి ప్రొడక్షన్ హౌసులు కల్పిస్తుంటాయి.
*నాగ్ అశ్విన్ మీకు ముందే పరిచయమా?
హ అవును. మా ఇద్దరికీ చాలా ఏళ్ల క్రితమే పరిచయం ఉంది. నాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. నా యూట్యూబ్ వీడియోలు తను చాలా ఇష్టపడేవాడు.
*నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సమయంలో మిమ్మల్ని ఏదైనా పాత్రకోసం అడగలేదా?
అనుకున్నాం కానీ కుదర్లేదు. నాతో ఓ ప్రాజెక్టు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు నాగ్ అశ్విన్. ఇన్నాళ్లకు వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు.
*సీన్స్ విషయంలో సెట్లోనే ఇంప్రూవ్ మెంట్స్ చేశారట. నిజమేనా?
నిజం చెప్పాలంటే.. నాకు ఏదైనా సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయగలిగే ఫ్రీడమ్ ఇస్తే.. ఇంకా బాగా చేయగలను. ఆ ఫ్రీడమ్ నాకు నా దర్శకులు ఇచ్చారు. ముఖ్యంగా కామెడీలో టైమింగ్. ఆ సీన్ లో ఫన్ ఉందా, లేదా? అని జడ్జ్ చేయగలడం చాలా ముఖ్యం. మేమంతా కూర్చుని మాట్లాడుకుని ఏది కరెక్ట్ ఉంటుందో లేదో చూసుకునేవాళ్లం.
*డైరెక్టర్ అనుదీప్ మేకింగ్ స్టైల్ ఎలా అనిపించింది?
నాకు చిన్న షాట్ ఉన్నా బాగా ప్రిపేర్ అయే చేస్తా. దర్శకుడు అనుదీప్ చాలా హడావుడి బ్యాచ్. ఓ టేక్ తీసుకుని వెళ్లిపోతాడు. సీన్ అవుతుండగానే కట్ చెప్పేస్తాడు. మొదట్లో నేను భయపడ్డాను ఇదేంటీ ఈయన సీన్ అవ్వకముందే కట్ చెప్పేస్తున్నాడు అని. నేను అలా కాదు. రెండు మూడు ట్రై చేస్తా.
*ఈ సినిమాలో జాతిరత్నాలు ఎలా ఉంటారు?
మీరు సినిమా చూస్తే వీళ్లు అసలు ఎప్పుడైనా స్కూలుకి వెళ్లారా అనిపిస్తుంది. అమాయకులే కానీ దుర్మార్గులు. దుర్మార్గం అంటే ఫన్నీ టైప్.
*చిట్టికి శ్రీకాంత్ మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది?
అదికూడా ఫన్ గానే ఉంటుంది. కానీ ఫన్ మాత్రమే కాదు. మంచి లవ్ ట్రాక్. చిట్టి - శ్రీకాంత్ లవ్ ట్రాక్ చాలా క్యూట్ గా ఉంటుంది.
*ఈ సినిమా నెల్లూరులో మీ అభిమాని కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు కదా.. ఏం జరిగింది?
అవును. ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడు అతనే. `అన్నా ఈ సినిమా 10 సార్లు థియేటర్లో చూద్దాం అనుకున్నా. కానీ ఆక్సిడెంట్ లో కాలు విరిగింది. చూడలేకపోతున్నా` అంటూ అతను ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. తనకోసం సినిమా ప్రత్యేకంగా చూపించాం. ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. తన బాధని మర్చిపోయాడు. ఈ సినిమా లక్ష్యం కూడా అదే. అతనితో వీడియో కాల్ మాట్లాడాను.
*చిచోరే తర్వాత బాలీవుడ్ లో ఏ సినిమా చేయట్లేదా..?
చేస్తున్నాను. ఓ సినిమా మొదలెట్టాం. షూటింగ్ మధ్యలో ఆగింది. లాక్ డౌన్ వల్ల… ఇబ్బందులు వచ్చాయి. త్వరలోనే ఆ షూటింగ్ పూర్తి చేస్తాం.
*మీకు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కదా.. జాతిరత్నాలు హిందీలో డబ్ చేస్తారా..?
చూడాలి. సినిమా రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ బట్టి మా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తారు. కనీసం సబ్ టైటిల్స్ తో అయినా రిలీజ్ చేస్తారేమో.. ఆలోచన అయితే ఉంది.
*రేపు మీ సినిమాతో పాటు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఎలా ఫీలవుతున్నారు?
అలా ఏంలేదు. మిగతా సినిమాల వాళ్లకు కూడా బెస్ట్ విషెస్ చెబుతున్నాను. అందరూ అన్ని సినిమాలూ చూస్తారు. ఏది బాగుందో, ఏది బాలేదో ప్రేక్షకులు చెబుతారు.
*తెలుగులో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం రెండు సినిమా చేస్తున్నాను. వాటి వివరాలు ఇప్పుడే చెప్పలేను. అవి కంప్లీట్ చేసేపనిలో ఉన్నాను. ఫ్యూచర్ లో డైరెక్షన్ గురించి అయితే ఆలోచన లేదు. ఇప్పడే కదా జర్నీ మొదలైంది.