దిల్ రాజుకు దొరక్కుండా తిరుగుతున్న యువ హీరో

Update: 2022-09-13 01:30 GMT
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఒకప్పుడు కొత్త వారికి చాలా ఎక్కువగా అవకాశాలు వచ్చేవి. ఆయన ప్రొడక్షన్ నుంచి వచ్చిన కొత్త దర్శకులు ఇప్పుడు స్టార్ దర్శకులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ బోయపాటి శ్రీను వంశీ పైడిపల్లి బొమ్మరిల్లు భాస్కర్ ఇలా చాలామంది యువ దర్శకులు ఆయన సంస్థల నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే హీరోలు కూడా ఆయన సంస్థలో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఎవరైనా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు అంటే దిల్ రాజు వెంటనే ఆ యువ హీరోలను బుక్ చేసుకునేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం దిల్ రాజు ఫార్మాట్ కొంత మారిపోయింది. ఆయన ఎక్కువగా అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తెరపైకి తీసుకురావాలి అని ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ తో ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ఇక లిస్టులో రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్టు కూడా ఉంది. విజయ్ వారసుడు కూడా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక ఇలాంటి బడా ప్రాజెక్టులతో పాటు దిల్ రాజు చిన్న తరహా హీరోలతో కూడా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. అదే తరహాలో ఆయన ఆలోచించే జాతి రత్నాలు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నవీన్ పోలీస్ శెట్టితో కూడా సినిమా చేయాలని ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు. అందుకోసం రెండు మూడు కథలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. అసలు జాతి రత్నాలు సక్సెస్ అయిన తర్వాతనే వెంటనే కలవాలని అనుకున్నప్పటికీ అప్పుడు నవీన్ అమెరికాలో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ ఉండడంతో కనెక్ట్ కాలేదు.

అయితే ఇటీవల దిల్ రాజు మొత్తానికి తన దగ్గర ఉన్న యువ దర్శకుక చేత కథను వినిపించడంతో అందులో ఒక్క దానికి కూడా ఈ హీరో పూర్తిస్థాయిలో అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. తర్వాత ఆలోచించుకొని చెబుతాను అని దిల్ రాజుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత మళ్లీ దిల్ రాజు ఈ హీరో కోసం సంప్రదించులు జరిపినప్పటికీ కూడా బిజీగా ఉన్నాను అని ఏదో సాకులు చెప్పి తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. దిల్ రాజుకు ఒక క్యూట్ లవ్ స్టోరీ కథ బాగా నచ్చడంతో అదే చేయాలి అని కాస్త ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే నవీన్ ఆయనకు అటు నో చెప్పలేక అటు ఎస్ చెప్పలేక జారుకుంటున్నట్లు టాక్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News