ఎక్స్ క్లూజివ్ - క్వారంటైన్ స్పెష‌ల్ - హీరో న‌వీన్ పోలిశెట్టి తో చిట్ చాట్

Update: 2020-04-22 02:45 GMT
* హాయ్ న‌వీన్ ఈ క్వారంటైన్ టైమ్ ని ఎలా గ‌డుపుతున్నారు

నా వంట నేను చేసుకోవ‌డానికి ట్రై చేయ‌డం అది అంత‌గా బాగా లేక‌పోయినా తింటూ నెట్ ఫ్లిక్స్ చూడ‌టం..! నా బ‌ట్ట‌లు నేను ఉత్తుక్కోవ‌డం మ‌ళ్లీ నెట్ ఫ్లిక్స్ చూడ‌టం..! ఇలా నా ప‌నులు నేను చేసుకుంటూ నెట్ ఫ్లిక్స్ చూస్తూ ఉండ‌టంతో ఈ టైమ్ ని పాస్ చేస్తూ ఉన్నా..! చాలా మంది త‌ల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ల పిల్ల‌లు ఇంట్లో కుర్చోని ఎంజాయ్ చేస్తున్నారని చాలా గ‌ర్వంగా చెబుతున్నారు...! నిన్న మొన్న‌టి వ‌రుకు ఇది పేరెంట్స్ దృష్టిలో చాలా పెద్ద క్రైమ్..! ఇప్పుడు వాళ్ల‌కి అదే న‌చ్చుతుంది..! ఎందుకంటే ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు క‌దా..!

* ఖాళీ స‌మ‌యం గురించి మాట్లాడుకుంటున్నాం క‌నుక ఈ ప్ర‌శ్న అడుగుతున్నా, హిట్ వ‌చ్చాక కూడా ఎందుకింత గ్యాప్

గ్యాప్ రాలేదండి కావ‌ల‌నే తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు త‌గ్గ క‌థ‌ల్ని, అలా సెలెక్ట్ చేసిన స్టోరీల‌కి నేను స్పెండ్ చేసే టైమ్ ఇలా థియేట‌ర్ లో కుర్చునే ఆడియెన్స్ కి మ‌నం ఎంత ఎంట‌ర్ టైన్మెంట్ ఇవ్వ‌గలం అనే లెక్క‌లు వేసుకోవ‌డం వ‌ల్లే నాకు ప‌త్రి సినిమాకి ఇంత టైమ్ ప‌డుతుంది. నేను అయితే ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయ‌లేను, ఒక్క సినిమా త‌రువాతే మ‌రో సినిమా పైన నా ఫొక‌స్ పెడ‌తాను. నా లెక్క ప్ర‌కారం నేను ఒక్కో సినిమాకు దాదాపు 8 నెలలు స‌మ‌యాన్ని కేటాయిస్తాను.

* మీరు లాంఛింగ్ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ కి లాస్ట్ ఇయ‌ర్ వ‌చ్చిన ఏజెంట్ కి వ‌చ్చిన గ్యాప్ ఇలా స‌రైన క‌థ దొరక్క పోవ‌డం వ‌ల్లే వ‌చ్చిందా

అవునండీ క‌చ్ఛితంగా చెప్ప‌గ‌ల‌ను, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ త‌రువాత నేను హీరోగా ట‌ర్న్ అవ్వ‌డానికి వ‌చ్చిన ఈ లాంగ్ గ్యాప్ స‌రైన స్టోరీ దొర‌క్క పోవ‌డమే, అయితే మ‌రీ అంత లాంగ్ గ్యాప్ లేకుండా ఇప్పుడు జాగ్ర‌త్త ప‌డుతున్నా

* ఈ గ్యాప్ డిస్క‌ష‌న్ కి కాసేపు గ్యాప్ ఇద్దాం, ఎందుక‌ని ఏజెంట్ లాంటి ట‌ఫ్ స‌బ్జెక్ట్ ఎంచుకోవాల్సి వ‌చ్చింది

ఎజెంట్ సినిమా కంప్లీట్ అయ్యాక మేము కొంత మందికి ప్రివ్యూ వేశాము..! చాలా మంది ఇండ‌స్ట్రీకి చెందిన వారు ఇందులో పాట‌లు లేవు, గ్లామ‌ర్ కంటెంట్ లేదు, ఫైట్స్ ఏమైనా పెడితే బాగుటుంది..! లేక‌పోతే సినిమా క‌ష్టం అని స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు..! కొంద‌రు జ‌న‌ర‌ల్ ఆడియ‌న్స్ మాత్రం సినిమా చాలా ఆస‌క్తిగా ఉంది..! కొత్త పాయింట్..! మంచి క‌థ ఎంచుకున్నార‌ని చెబుతూ వ‌చ్చారు...! ఇక సినిమా తీసేశాం..! బాగా అడుతుంది అనే న‌మ్మ‌కంతో రిలీజ్ చేశాం..! సినిమా పెద్ద హిట్ అయింది..! ఈ రిజల్ట్ చూశాక నాకు ఒక్క‌ట్టే అనిపించింది..! ఆడియెన్స్ చాలా మారారు..! కొత్త కంటెంట్ ని..! ఢిప‌రెంట్ పాయింట్స్ ని ప్రొత్స‌హిస్తున్నారు..! మ‌నం చేయాల్సిందల్లా వాళ్ల‌కి బోర్ కొట్ట‌కుండా సినిమా తీస్తే స‌రిపోతుంది..!


* ఏజెంట్ కి సీక్వెల్ చేసే ప్లాన్ ఉందా

ఏజెంట్ మూవీ హిట్ అవ్వ‌డానికి ముఖ్య కార‌ణం..! ఈ ప్రాజెక్ట్ పై నా యాక్టింగ్ పై ఆడియెన్స్ లో ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేక‌పోవ‌డ‌మే..! ఓ బ్లాంక్ మైండ్ తో ఏజెంట్ చూసిన ఆడియెన్స్ కి ఈ మూవీ చాలా ఎంట‌ర్ టైన్మెంట్ ని ఇచ్చింది..! దీంతో ఇప్పుడు ఏజెంట్ కి సీక్వెల్ తీయాలంటే చాలా ఎక్సెపెక్టేష‌న్స్ ని క్యారీ చేస్తూ రెడీ చేయాలి..! ఆడియెన్స్ ఎక్సెపెక్టేష‌న్స్ ని రీచ్ అయ్యే స్టోరీ, అదే రేంజ్ లో ఎగ్జేటయ్యే పాయింట్ కోసం చూస్తున్నా..! ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను ఈ ఏజెంట్ కి సీక్వెల్ క‌చ్ఛితంగా ఉంటుంది..! ఎప్పుడు అనేది మాత్రం ప్ర‌స్తుతానికి చెప్ప‌లేను


* జాతి ర‌త్నాలు తో మీ స్టార్ మ‌ళ్లీ తిరుగుద్దని ఎక్సెపెక్ట్ చేస్తున్నారా

నూటికి నూరు శాతం ఈ సినిమా ఆడియెన్స్ కి ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నా..! రెండున్న‌ర గంట‌ల పాటు హాయిగా న‌వ్వుకుంటారు ప్రేక్ష‌కులు..! ఫుల్ లెంత్ కామెడీ సినిమా ఇది..! వైజ‌యంతీ టీమ్ అంత బాగా ఈ మూవీని రెడీ చేశారు..! ఈ ప్రాజెక్ట్ పై నేను చాలా క‌న్ఫిడెంట్ గా ఉన్నాను..! ష‌ట్ డౌన్ ముగిశాక మంచి టైమ్ లో ఈ సినిమా రిలీజ్ జరిగితే బాగుటుంది.


* నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటిల‌కు మీరు కూడా అభిమానే, మ‌రి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కి రావ‌డం త‌గ్గస్తే ఇండ‌స్ట్రీకి నష్టం రాదంటారా

నా ప‌ర్స‌న‌ల్ ఒపీనియ‌న్ ని ఇది..! థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ అనేది ఓ కమ్యూనిటీ ఫీలింగ్ మాదిరి ప‌నిచేస్తుంది..! ఒకే సారి దాదాపు 300 మంది లైక్ మైండ్ పీపుల్ చేసే వివిధ ర‌కాల యాక్టివిటీస్ థియేట‌ర్ లో మ‌నం ఫీల్ అవ్వ‌చ్చు..! ఒక మంచి సినిమాని థియేట‌ర్ లో చూసి బ‌య‌టకు వ‌చ్చాక, ఆ ఫీల్ చాలా సమ‌యం మ‌న‌లో ఉంటుంది..! ఓటిటిలు వ‌చ్చినా, ఇంకేమైనా టెక్నాల‌జీ కొత్త‌గా రిలీజైన స‌రే థియేట‌ర్ వ‌చ్చే ఆడియెన్స్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని నేను భావిస్తున్నాను. అయితే క్వాలిటీ కంటెంట్ ని మాత్రం ఇవ్వాల్సిన బాధ్య‌త మాత్రం ‌క్రియేట‌ర్స్ చేతిలోనే ఉంది.

* చిచోరే త‌రువాత బాలీవుడ్ నుంచి మ‌ళ్లీ పిలుపు వ‌చ్చిందా

చిచోరే నా పాత్ర అంత రేంజ్ లో హిట్ అవుతుంద‌ని నేను అస్స‌లు ఎక్స్ పెక్ట్ చేయ‌లేదు..! ఏజెంట్ న‌న్ను తెలుగు ఆడియెన్స్ కి ద‌గ్గ‌ర చేస్తే..! చిచోరే లో యాసిడ్ పాత్ర న‌న్ను హిందీ ఆడియెన్స్ కి పరిచ‌యం చేసింది..! ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్ వారు తీస్తున్న ఓ గ్యాంగ్ స్ట‌ర్ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్నాను, కొంత మేర ఈ సీరిస్ షూటింగ్ జ‌రిగింది..! లాక్ డౌన్ ముగిశాక మ‌ళ్లీ ఆ షూట్ లో జాయిన్ అవుతాను..! కొన్ని బాలీవుడ్ స్క్రిప్ట్స్ వింటున్నా కానీ ఏ ప్రాజెక్ట్ కి ఇంకా క‌మిట్మెంట్ ఇవ్వ‌లేదు..!

* టాలెంట్ ఉన్న‌వారిని తెలుగు ప్రేక్ష‌కుల ఎప్పుడూ ఎంక‌రైజ్ చేస్తారు, మీ న‌ట‌న‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది..! మీ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అవ్వాల‌ని మా తుపాకీ టీమ్ మ‌నఃస్పూర్తిగా కోరుకుంటుంది..! ఆల్ ది బెస్ట్

రీడ‌ర్స్ అంద‌రికీ నా రిక్వెస్ట్, ఈ లాక్ డౌన్ ముగిసే వ‌ర‌కు ఎవ్వ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దు, బోర్ కొడితే తుపాకీ డాట్ కామ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్ డేట్స్ చద‌వండి. స్టే హోమ్ స్టే సేఫ్
Tags:    

Similar News