విచిత్రమైన వివాదం ఒకటి తెర మీదకు వచ్చింది. హిందువులు ఎంతో ఇష్టంగా కొలిచే దేవుళ్లలో శివుడు ఒకరు. అయితే.. శివుడ్ని కించపరిచేలా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ సోదరుడిపై కేసు పెట్టిన ఉదంతం సంచలనంగా మారింది. తనపై పెట్టిన కేసు అన్యాయమని.. జరిగింది పూర్తి తెలుసుకోకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎలా కేసు బుక్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ సోదరుడిపై శివుడ్ని కించపరిచారన్న ఆరోపణపై కేసు నమోదు చేశారు. దీనిపై సదరు నటుడి సోదరుడు స్పందిస్తూ.. తాను తప్పు చేసిన వారి తప్పును ఎత్తి చూపించానే తప్పించి ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. శివుడి ఫోటోను అభ్యంతరకరంగా పోస్టు చేసిన ఒక వ్యక్తి తీరును తాను ఖండించానని.. అలాంటి ఫోటో ఎలా పెడతారని తప్పు పట్టానని.. ఆ విషయాన్ని చెప్పే క్రమంలో ఆ ఫోటోను తాను వాడానే తప్పించి.. తనకు శివుడ్ని కించపరిచే ఆలోచన లేదన్నారు.
ఫేస్ బుక్ లాంటి మాధ్యమంలో అలాంటి అభ్యంతరకర ఫోటోలు మంచివి కావని తాను చెబుతూ పోస్ట్ చేశానని.. తప్పుగా భావించి తనపై ఫిర్యాదు చేసినట్లుగా ఆయన వాదిస్తున్నారు.మనోభావాలు దెబ్బ తినేలా పోస్టులు పెట్టకూడదన్న మాటనే తాను చెప్పానే తప్పించి.. కించపరిచేలా తాను వ్యవహరించలేదని సిద్దఖీ సోదరుడు వివరణ ఇస్తున్నారు. మరి.. దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.