ఆ నటుడు ఆత్మకథను వెనక్కి తీసుకున్నాడు

Update: 2017-10-31 07:50 GMT
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి తన ఆత్మకథ ‘ది ఆర్డినరీ లైఫ్’ను వెనక్కి తీసుకున్నాడు. కొన్ని రోజుల కిందటే ఆన్ లైన్లోకి వచ్చింది. ఐతే విడుదలైన కొన్ని రోజులకే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. నటుడిగా మారాక తాను నడిపిన ఎఫైర్ల గురించి ఇందులో కూలంకషంగా వివరించాడు నవాజ్. ముఖ్యంగా ‘మిస్ లవ్లీ’ సినిమాలో తనకు జోడీగా నటించిన నిహారిక సింగ్ తో ఎఫైర్ గురించి మరీ డీప్ గా రాశాడు. ఆమెతో శృంగారం జరిపిన అనుభవం గురించి వివరించడానికి ఒక స్పెషల్ ఎపిసోడే కేటాయించాడు. అంతకుముందు ఓ మహిళతో బ్రేకప్ తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయాన్ని కూడా వెల్లడించాడు.

ఐతే నిహారికతో పాటు వేరే మహిళ కూడా నవాజుద్దీన్ ఆటో బయోగ్రఫీ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడానికి నవాజ్ లేని పోని విషయాలు కల్పించి అబద్ధాలు రాశాడని ఆరోపించారు. అతడితో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. మరోవైపు మహిళల్ని కించపరిచేలా ఈ పుస్తకం ఉందంటూ ఓ లాయర్ నవాజ్ మీద కేసు పెట్టాడు. దీంతో నవాజ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తన పుస్తకం వల్ల కొందరి సెంటిమెంట్లు దెబ్బ తిన్నాయని.. ఇందుకు తనను మన్నించాలని.. తన పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నానని నవాజ్ ప్రకటించాడు. ఐతే ఆల్రెడీ ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ అయిపోయిన ఈ పుస్తకం జనాల్లోకి బాగానే వెళ్లిపోయింది.

Tags:    

Similar News