చాలా రోజుల తర్వాత నయన్ సినిమాకు ఫ్లాప్ టాక్!

Update: 2019-03-29 12:57 GMT
కొలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ తెచ్చుకున్న నయన్ లేటెస్ట్ ఫిలిం 'ఐరా'.  ఈమధ్య నయన్ నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతుండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.  బాగా అచ్చొచ్చిన హారర్ జోనర్..పైగా డబల్ రోల్ లో నటించడంతో క్రేజ్ మరింతగాపెరిగింది.  కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రంఈ చిత్రం ప్రేక్షకుల చేత ఉసూరుమనిపించింది.

నయన్ కు స్టార్ ఇమేజ్ ఉండడంతో తమిళనాట భారీ ఓపెనింగ్స్ అయితే తెచ్చుకోగలిగింది కానీ విమర్శలు పెదవివిరిచారు.. మౌత్ టాక్ కూడా బ్యాడ్ గా ఉంది.  అవుట్ డేటెడ్ ఫార్మాట్ తో పాటు వీక్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెట్టారని అంటున్నారు.  సినిమాలో నయన్ నటన తప్ప మరో చెప్పుకోదగిన అంశం లేదని తేల్చేశారు.  ముఖ్యంగా క్లైమాక్స్ బాగాలేదని అంటున్నారు.. దీంతో మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది.  ఇక తెలుగులో అయితే ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.  తమిళంలో అయినా కనీసం సినిమాకు యావరేజ్  రేంజ్ లో రివ్యూ రేటింగ్స్ వచ్చాయి కానీ తెలుగులో అయితే రివ్యూస్ కూడా బ్యాడ్ గానే ఉన్నాయి.

వరస విజయాలతో తన కెరీర్ లో దూసుకు పోతున్న నయన్ కు ఈ చిత్రం స్పీడ్ బ్రేకర్ లా తగిలినట్టే. ఇదిలా ఉంటే నయన్ నెక్స్ట్ సినిమా 'కొలైయుతిర్ కాలం' త్వరలోనే రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సినిమానే కాకుండా మరో నాలుగు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి.  అందులో తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా కూడా ఉంది.
Tags:    

Similar News