కరోనా లాక్ డౌన్ అన్ని రంగాలకన్నా.. సినిమా ఇండస్ట్రీపై దారుణ ప్రభావం చూపిందనే చెప్పాలి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో.. అనివార్యంగా సినిమా షూటింగులు మొదలు థియేటర్ల వరకు అన్నీ మూసేయాల్సి వచ్చింది. ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ కండీషన్లో పలు సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. అలాంటి వాటిల్లో సౌత్ స్టార్ నయనతార మూవీ కూడా ఉంది.
నయన్ అప్ కమింగ్ మూవీ ‘నెట్రికన్’. ఈ మూవీ షూట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ పని కూడా అతి త్వరలో ముగియబోతోంది. అయితే.. ఈ చిత్రాన్ని ఎక్కడ రిలీజ్ చేయాలనేది ప్రశ్న. థియేటర్లు చూస్తే.. ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు. దక్షిణాదిన తమిళనాట ఉన్నన్ని కేసులు మరే రాష్ట్రంలోనూ లేవు. అందువల్ల సినిమా థియేటర్లు ఓపెన్ కావడానికి చాలా కాలం పడుతుంది.
దీంతో.. ఓటీటీకి వెళ్లాలా? వద్దా? అని తర్జనభర్జన పడింది నెట్రికన్ టీమ్. పలు దఫాల చర్చ అనంతరం ఓటీటీకే ఓటు వేశారట. నయనతార సైతం దీనికే ఓకే చెప్పిందని సమాచారం. డిస్నీ హాట్ స్టార్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతోందని టాక్. జులైలో వదలబోతున్నారని తెలుస్తోంది.
కంటి చూపు లేని యువతి.. కేవలం వినికిడి శక్తిద్వారా ఓ సిరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది? అన్నదే ఈ మూవీ స్టోరీ. సౌత్ లో నయనతార క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ నేపథ్యంలో.. నెట్రికన్ సినిమాకు మంచి అమౌంట్ నే హాట్ స్టార్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. నయన్ లవర్ విఘ్నేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. మిలింద్ రావ్ తెరకెక్కించాడు.