ఆస్కార్ రేసులో న‌య‌న‌తార సినిమా

Update: 2021-12-22 16:30 GMT
ఇండియా నుంచి విదేశీ చిత్రాల విభాగంలో ప్ర‌తీ ఏడాది మ‌న చిత్రాలు ఆస్కార్ బ‌రికి పోటీప‌స‌డుతూనే వున్నాయి. కానీ నామినేట్ మాత్రం కాలేక‌పోతున్నాయి. `ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందించిన `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` అప్ప‌ట్లో ఆస్కార్ బ‌రిలో నిలిచి అవార్డుల్ని అందించింది. ఆ సినిమా కార‌ణంగా ఏ.ఆర్‌. రెహ‌మాన్ కు ఈ సినిమా బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డుని అందించింది. అప్ప‌టి నుంచి మ‌న వాళ్లు ఆస్కార్ అవార్డు కోసం పోటీప‌డుతూనే వున్నారు.

తాజాగా ఈ రేసులో న‌య‌న‌తార చిత్రం `కూళాంగ‌ల్‌` చోటు ద‌క్కించుకునేలా క‌నిపిస్తోంది. పీఎస్ వినోద్‌రాజ్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ రౌడీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార, ఆమె ప్రియుడు, డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ నిర్మించిన చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు పీఎస్ వినోద్ రాజ్ కుటుబంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నుంచి ప్రేర‌ణ పొంది ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ట‌. మ‌ధురై మేలూర్ స‌మీపంలోని అరిట్ట‌పెట్టై లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. 30 రోజుల పాటు ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రిగింది.

ఓ య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్ప‌టికే అనేక ఫిల్మ్ ఫెస్టివెల్‌ల‌లో ప్ర‌దర్శంప‌బ‌డి ప‌లు అవార్డుల్ని ద‌క్కించుకుంది. ఈ ఏడాది విదేశీ చిత్రాల విభాగం లో ఆస్కార్ కు నామినేట్ అవుతున్న చిత్ర‌మిది. ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము తొలిసారి క‌లిసి నిర్మించిన `కూళాంగ‌ల్‌` ఆస్కార్ అవార్డుల తుది జాబితాలో నిలుస్తుంద‌ని ఆశా భావం వ్య‌క్తం చేయ‌డం విశేషం.

న‌య‌న‌తార ప్ర‌స్తుతం స‌మంత‌తో క‌లిసి `కాతువాకుల రెండు కాద‌ల్` చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీని న‌య‌న ల‌వ‌ర్ విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ ద‌శ‌లో వుంది. తెలుగులో న‌య‌న‌తార .. మెగాస్టార్ న‌టిస్తున్న `గాడ్ పాద‌ర్‌`లో ఆయ‌నకు జోడీగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా రీమేక్ అవుతోంది


Tags:    

Similar News