శుభ‌ఘ‌డియ ముంచుకొ‌స్తే ఇంకేదీ ఆగ‌దులే న‌య‌న్

Update: 2020-08-05 04:00 GMT
శాస్త్రం వ‌ర్జ్యం పూజ్యం అని చెబుతుంటే కొంద‌రికి ఓ ప‌ట్టాన ఎక్క‌వు. కానీ అనుభ‌వ పూర్వ‌కంగా అనుభవించేశాక ఇవ‌న్నీ మొద‌లు పెడుతుంటారు. కొంద‌రైతే పెద్ద‌లు సూచించిన వాటిని తూ.చ త‌ప్ప‌క పాటించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఈ మూడో కేట‌గిరీకే చెందుతుంది న‌య‌న‌తార‌. ఈ అమ్మ‌డు జ‌న్మ‌తః క్రిస్టియ‌న్ అయినా హిందూ సంప్ర‌దాయాల్ని గౌర‌విస్తుంది. హిందూ దేవ‌త‌ల్ని కూడా ఆరాధిస్తుంది. జీస‌స్ తో పాటు దేవ‌త‌ల్ని న‌మ్మే అల‌వాటు ఉంద‌ని ఇంత‌కుముందు దేవాల‌యాల విజిట్ తేల్చి చెప్పింది.

జ్యోతిష శాస్త్ర‌జ్ఞులు చెప్పేది న‌య‌న్ విప‌రీతంగా విశ్వసిస్తుంద‌ట‌. అందుకే గ‌త ఏడాది కాలంగా గుడులు గోపురాల్ని సంద‌ర్శిస్తూ ర‌క‌ర‌కాల పూజ‌లు చేస్తూ న‌య‌న్ తాను ఆశించిన పనుల‌కు ఎలాంటి విఘ్నం లేకుండా చేయాల‌నుకుంటోంది. ముఖ్యంగా కాబోయే వాడు విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి గుడులు గోపురాలు తిరుగుతోంది. ఇక ఈ జంట పెళ్లి గురించి ఇప్ప‌టికే మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలొస్తున్నాయి. అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయినా ఏదో అడ్డంకి ఎదుర‌వుతూనే ఉంది.

ఇదిగో మేక అంటే అదిగో పులి! అన్న చందంగా ఉంది. 2019 డిసెంబ‌ర్ లో పెళ్లి అన్నారు. కానీ కుద‌ర‌లేదు. వేస‌వి నాటికి క్యూలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి పెళ్లాడేస్తుంద‌ని అన్నారు. కానీ అవ్వ‌లేదు. తాజాగా కోవిడ్ విల‌యం పెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్ క‌మిట్ మెంట్స్ ముగించి పెళ్లాడి ఇక సంసారంలో దిగిపోవాల‌ని చూస్తున్న న‌య‌న్ కి అన్నీ అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. న‌య‌న్- విఘ్నేష్ జంట ఇంకా సందర్శించని ఏకైక ఆలయం కుంబకోణం తిరునగేశ్వరంలోని లార్డ్ రాహు ఆలయం. కాబట్టి ఈ జంట ఈ ఆలయాన్ని సందర్శ‌న పూర్తి చేస్తే శుభం క‌లుగుతుంద‌ని న‌మ్ముతున్నార‌ట‌. ఆ ప‌ని అయితే క‌ళ్యాణం అయిన‌ట్టేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక విఘ్నేష్ శివ‌న్ ఓ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. న‌య‌న్ రెండు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ర‌జ‌నీ కాంత్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌య‌న్ నాయిక‌గా న‌టిస్తోంది.
Tags:    

Similar News