స్టార్ హీరోయిన్ నయనతార త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా? నయన్-విఘ్నేష్ తమ బంధానికి ముడివేసుకోబోతున్నారా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. వారిద్దరూ అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారని తెలుస్తోంది.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్-నయనతార చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి వీరి సహజీవనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వారి వివాహం గురించి గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సంవత్సరమే వారిద్దరూ వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
కోలీవుడ్ మీడియా ప్రకారం, విఘ్నేష్-నయన్ ఈ ఫిబ్రవరిలోనే వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారట. ఈ పెళ్లి హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని తెలుస్తోంది. అయితే.. ఈ వేడుక భారీగా నిర్వహించట్లేదట. కేవలం పరిమిత సంఖ్యలో బంధుమిత్రులను తమ వివాహానికి ఆహ్వానిస్తారని సమాచారం. వీరి వివాహం త్వరగా జరగాలని ఇద్దరి తల్లిదండ్రులు కోరుకుంటున్నారని, అందుకే వీరు త్వరగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, లేదంటే.. మరికొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లో ఈ జంట ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
2015 తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీ ధాన్’ షూటింగ్ సందర్భంగా నయన్-విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వారి డేటింగ్ కొనసాగింది. వీరిద్దరూ కలిసి తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఫ్యాన్స్ లైక్ చేయడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘కథువాకుల రెండు కాదల్’ చిత్రానికి కలిసి పనిచేస్తున్నారు.