సౌత్ బ్యూటీ నయనతార.. ఈ మధ్య తెగ షికార్లు కొట్టేస్తోంది. అది కూడా ఈ భామకు అమెరికా ట్రిప్పులు ఎక్కువ అయిపోయాయి. స్టార్ హీరోయిన్ అన్నాక ఈ మాత్రం ట్రిప్పులు సహజమే కానీ.. ఈమె వెళ్లినపుడల్లా తన బాయ్ ఫ్రెండ్ అయిన విఘ్నేష్ శివన్ ను కూడా వెంటబెట్టుకు వెళుతోంది. వీరిద్దరూ లాస్ ఏంజెల్స్.. కేలిఫోర్నియాలలో చక్కర్లు కొడుతూ.. కెమిస్ట్రీ పండించేస్తూ ఫోటోలు దిగేస్తుంటే.. వాటిని తీసుకొచ్చి నెట్ లో పెట్టేస్తున్నాడు ఈ బాయ్ ఫ్రెండ్.
వీరిద్దరు అమెరికాకి ఎందుకు ఇన్ని సార్లు వెళుతున్నారా అని కొంతమంది ఆరా తీయడం మొదలుపెట్టారు. వారికి ఓ షాకింగ్ రీజన్ తెలిసిందట. అదేంటంటే.. నయనతార రిటైర్మెంట్ ప్లాన్ వేసిందని అందులో భాగంగానే ఈ అమెరికా టూర్స్ వెళుతోందని తెలుస్తోంది. కేలిఫోర్నియాలోని ఓ ప్రాంతంలో హోటల్ బిజినెస్ నిర్వహించేందుకు రెడీ అవుతోందట ఈ జంట. మరి అమెరికాలో వ్యాపారం అంటే పెట్టుబడి చాలా ఉండాలి.. పైగా అక్కడ సెటిల్ అవాలంటే గ్రీన్ కార్డ్ కావాలి కదా. ప్రస్తుతం నిర్మాతల ముక్కు పిండి మరీ నయన్ అంతేసి రెమ్యూనరేషన్ వసూలు చేయడం వెనక కథ అదే అని తెలుస్తోంది.
యూఎస్ ఇన్వెస్ట్ మెంట్ ప్రోగ్రాం కింద.. ఓ మిలియన్ డాలర్లను అంటే ఆరున్నర కోట్ల రూపాయలను అక్కడ పెట్టుబడులు చేస్తే.. ఆ పర్సన్ కి గ్రీన్ కార్డ్ వచ్చేసినట్లే. తను రిటైర్ అయేలోపు.. ఈ ఆరున్నరకు తోడు మరో పదో పరకో కోట్లు ఖాతాలో వేసుకుని మరీ అమెరికా వెళ్లి సెటిల్ అవాలన్నది నయనతార ఆలోచనగా చెబుతున్నారు.