హీరోయిన్ గా నయనతార వెలుగు..జిలుగుల గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు..తమిళ్ భాషల్ని ఏలేసింది. బాలీవుడ్ పిలిచి అవకాశాలిస్తామన్నా చాలా సెలక్టివ్ గా వెళ్తోంది. ప్రస్తుతం బాద్ షా షారుక్ ఖాన్ సరసన జవాన్ లో నటిస్తోంది. ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్ అంతటా ఫేమస్ అవుతుందన్న అంచనాలున్నాయి. ఇలా హీరోయిన్ గా నయనతార కెరీర్ గురించి వెనక్కి తిరిగి చూసే పనిలేదు.
అయితే హీరోయిన్ ఓరియేంటెడ్ చిత్రాలతోనే బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కొన్ని హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించింది. నటిగా పాస్ అయింది. కానీ చంద్రముఖిలా ఫేమస్ కాలేకపోతుంది. ఆరకమైన సక్సెస్ కోసం ఎంతోకాలంగా వెయిట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కువగా ఆమె హారర్ జానర్ చిత్రాలే ఎంపిక చేసుకుంటుంది.
తాజాగా `కనెక్ట్` అనే హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. త్వరలో రిలీజ కానున్న ఈసినిమా ఎలాంటి బ్రేక్ లేకుండా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకుల్ని సీట్ లో కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురి చేయాలంటే రిలాక్స్ టైమ్ ఇవ్వకూడదని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలస్తోంది. ఈ సినిమా కేవలం 95 నిమిషాల నిడివితోనే రిలీజ్ అవుతుంది.
అంటే గంటన్నర వ్యవధిగల ఇంగ్లీష్ హారర్ సినిమా తరహాలో అన్న మాట. ఈనేపథ్యంలో కనెక్ట్ పై బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు సినిమాకి పాజిటివ్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టెక్నికల్ గా సినిమా హైలైట్ అవుతుందని ఫీడ్ బ్యాక్ వస్తోంది. అయితే 95 నిమిషాల సినిమాని ఇంకా ట్రిమ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడుట.
అలా చేస్తే ఇంకా వేస్టెజ్ ఉంటే తొలగిపోతుందని అంటున్నాడుట. ఇదే విషయాన్ని నయన్ దృష్టికి తీసుకెళ్తే అలా చేస్తే నిడివి మరీ తగ్గిపోతుందని సందేహం చేసిందిట. అయినా తుది నిర్ణయాన్ని దర్శకుడికే వదిలేసినట్లు సమాచారం. మరి 95 నిమిషాల సినిమాని ఇంకా ట్రిమ్ చేస్తారా? అలాగే ఉంచుతారా? అన్నది తెలియాలి. మరి రిలీజ్ తర్వాత ప్రేక్షకులకు `కనెక్ట్` అవుతుందా అన్నది చూడాలి. అలాగే ఇటీవలే నయన్ పుట్టిన రోజు కానుకగా భర్త విగ్నేష్ శివన్ ఆమెతో మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.