మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాను స్టార్ట్ చేసేశారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో.. ఓ తెలుగు స్వతంత్ర సమర యోధుడి చరిత్రను ఆవిష్కరించబోతున్నారు. సైరా అనే టైటిల్ పై పలు భాషల్లో ఈ చిత్రం రూపొందుతుందంటూ.. ప్రకటన ఇచ్చి 4 నెలలు పూర్తి కాగా.. డిసెంబర్ ఆరంభంలో షూటింగ్ స్టార్ట్ చేశారు కూడా. హైద్రాబాద్ పరిసరాల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
తర్వాతి షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకునేందుకు యూనిట్ రెడీ అయింది కానీ.. ఒకరితో ఇబ్బందులు వస్తున్నాయట. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండగా.. లేడీ అమితాబ్ రేంజ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నయనతార మాత్రం.. సైరాకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు. సైరా మూవీలో నయనతార లీడ్ హీరోయిన్. మూవీలో హీరోయిన్ గా నటించేందుకు ఈమె యాక్సెప్ట్ చేసింది కానీ.. డేట్స్ మాత్రం అలాట్ చేయడం లేదట. తర్వాత షూట్ చేయాలంటూ వేసుకున్న షెడ్యూల్ లో.. నయన్ పోర్షన్ ఉందని తెలుస్తోంది.
అయితే.. నయన్ మాత్రం ఈ విషయంలో ఎటూ తేల్చడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సురేందర్ రెడ్డి పలు మార్లు నయన్ తో సంప్రదింపులు చేసినా.. పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే నయన్ వలనే డిలే అవుతోందని రూమర్లు వస్తున్న వేళ.. ఆ పాత్రకు వేరే హీరోయిన్లను కూడా సంప్రదిస్తున్నారని కూడా మరో రూమర్ వినిపిస్తోంది. మరి చూద్దాం ఈ రూమర్లు రియాల్టీలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో.