నయనతారకు దాదాపు రిటైర్మెంటేగా...

Update: 2016-08-24 22:30 GMT
ఇప్పటివరకు రీ-ఎంట్రీ ఇచ్చాక ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది నయన్. అది ఆమె తప్పా లేకపోతే నిర్మాతలు అండ్ డైరక్టర్లు ఆమెను అలాంటి రోల్స్ లోకి క్యాస్టింగ్ చేశారా అనే విషయం పక్కనెడితే.. అసలు తెలుగు సినిమాల నుండి దాదాపు నయన్ రిటైర్మెంట్ తీసుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు.

ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక.. నయన తన ప్రామిస్ ను పక్కనెట్టేసి.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వెంటనే ఆమెను ''కృష్ణం వందే జగద్గురుమ్'' సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు రానా. అయితే ఆ సినిమాలో కాసింత హాటుగానే చాలా ప్రయత్నించింది కాని.. ఎందుకో ఆ పప్పులేం ఉడకలేదు. సినిమా కూడా ఆడలేదు. తర్వాత శేఖర్ కమ్ముల తీసిన కహానీ రీమేక్ ''అనామిక''లో నటించింది. అది కూడా ఫ్లాపే. అమ్మడి యక్టింగ్ అంతంతమాత్రమే. కట్ చేస్తే.. మధ్యలో రెండు మూడు డబ్బింగ్ సినిమాలతో వచ్చింది కాని.. అవి కూడా అమ్మడికి రిలీఫ్‌ ఇవ్వలేదు. సూర్య 'రాక్షసుడు' వంటి సినిమాలైతే మేజర్ డిజాష్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు తాజాగా ''బాబు బంగారం''తో వచ్చింది. పైగా నో-ఎక్స్ పోజింగ్ అనే క్లాజ్ కూడా పెట్టిందట. ఇవన్నీ ఏవీ తెలుగులో వర్కవుట్ మాత్రం కావట్లేదంతే.

ఇంకేముంది.. బ్యాగ్స్ అన్నీ ప్యాకప్ చేసుకుని.. తమిళంలో ఎన్ని ఛాన్సులొస్తే అన్ని వరుసగా చేసుకుంటూ పోవడమే. అంతకంటే మార్గం ఏం లేదు. చక్కగా చిరంజీవి 150వ సినిమా ఒప్పుకున్నా.. ఇంకాస్త ఫ్యూచర్ ఉండేదేమో.
Tags:    

Similar News