మాలీవుడ్ బ్లాక్ బస్టర్.. మార్కో తెలుగు ట్రైలర్ చూశారా?

మాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మార్కో మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Update: 2024-12-28 10:57 GMT

మాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మార్కో మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఉన్ని ముకుందన్ హీరోగా, హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. గత వారం మలయాళం భాషలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

బ్లడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మార్కో మూవీ.. కేరళలో వేరే లెవెల్ లో అదరగొడుతోంది. ఉన్ని ముకుందన్ యాక్టింగ్ కు మంచి ప్రశంసలు లభించాయి. రూ.30 కోట్లతో నిర్మించిన మార్కో విడుదలైన వారం రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ పండితులు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ సినిమా తెలుగులో అలరించేందుకు సిద్ధమైంది.

న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన మార్కో మూవీ విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. జీవితంలో మనను హార్న్ చేసిన విషయమేమిటో తెలుసా.. మనకు ఎంతో ఇష్టమైన వాళ్లను మన కళ్ల ముందే చంపడం అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది.

ఆ తర్వాత అదిరిపోయే యాక్షన్ సీన్స్ ను చూపించారు మేకర్స్. ఒక్కో సీన్ వేరే లెవెల్ లో ఉంది. కొన్ని సన్నివేశాలు హింసాత్మకంగా కూడా ఉన్నాయి. ఉన్ని ముకుందన్ లుక్స్ అయితే స్టన్నింగ్ అనేలా ఉన్నాయి. అయితే ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ట్రైలర్ లో యాక్షన్ సీన్స్.. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అని చెప్పాలి. నెవ్వర్ బిఫోర్ యాక్షన్ అనుభూతిని మూవీ అందించనుందని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. హనీఫ్ అదేని రచన, దర్శకత్వం వహించారు. షరీఫ్ మహమ్మద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగులో ఎన్‌ వీఆర్‌ ఫిలింస్‌ అత్యంత గ్రాండ్‌ గా సినిమాను రిలీజ్‌ చేస్తోంది. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు కబీర్ దుహాన్ సింగ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి తెలుగులో మార్కో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News