ప్రమోషన్లపై ఇదీ నయన్ యాంగిల్

Update: 2017-01-28 04:59 GMT
సినిమాల్లో నటించడం తప్ప ఆయా మూవీస్ ప్రమోషన్స్ లో నయనతార అస్సలు కనిపించదు. తాను ప్రమోషన్స్ లో పాల్గొంటే.. మూవీ ఫ్లాప్ అవుతుందని నిర్మాతలను బెదరగొడుతుందని టాక్. ఇలా ప్రమోషన్స్ రాని హీరోయిన్లకు పెనాల్టీ విధించాలంటూ రీసెంట్ గా కమెడియన్ వివేక్ కామెంట్స్ చేశాడు. వాటిపై ఇప్పుడు నయన్ తన వెర్షన్ వినిపించింది.

'నేను కొన్ని విషయాలు నమ్ముతాను.. కొన్నింటిని ఫాలో అవుతాను. అవి నాకు పని చేస్తే.. ఇతరులకు పని చేయకపోవచ్చు. ఇతరుల పద్ధతులు నాకు వర్కవుట్ కాకపోవచ్చు. ప్రమోషన్స్ కు రాకపోవడం నా సొంత నిర్ణయం. నా దగ్గరకు స్క్రిప్ట్ తో వచ్చినపుడే ఈ విషయం చెబుతాను. సైన్ చేసేటపుడు కాదు. అలాగే ఓ వంద ఛానళ్ల ముందు కూర్చొను.. చెప్పిందే చెప్పి సినిమా చూడమనాల్సిన పని లేదు. జనాల్లో మార్పు వచ్చింది. ఇదంతా డిజిటల్ యుగం. ప్రమోషన్స్ లో చాలా కొత్త పద్ధతులు వస్తున్నాయి' అని చెప్పింది నయన్.

'మాయ..తని ఒరువన్ చిత్రాలకు కొంత ప్రమోషన్ చేశాను. అవసరం అనుకుంటే అప్పుడు సిద్ధమే. చిన్న అయితేనే.. ఆ మూవీకి నిజంగా నా ప్రమోషన్ అవసరం అయితేనో.. నిర్మాత అవసరాన్ని అర్ధం చేసుకోగలను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత వ్యవహారం. సినిమా నచ్చిందో లేదో జనాలు చెబుతారు. ప్రమోషన్ తో చెడ్డ సినిమా ఆడదు కదా. మూవీలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. బాగాలేని సినిమాకి వంద రోజులు ప్రమోట్ చేసిన అది ఫ్లాప్ అవుతుంది' అన్న నయనతార.. వివేక్ వ్యాఖ్యలపై కూడా స్పందించింది.

'వివేక్ సార్ చెప్పింది నా గురించే అని నాకు తెలుసు. ఫైనల్ పేమెంట్ వదులుకోవడానికి హీరోయిన్లు సిద్ధపడతారా అని కూడా అని అడిగారాయన. నేను నా రెమ్యూనరేషన్ చాలా సార్లు వదులుకున్నానన్నది నిజం. కొన్ని సినిమాలకు పారితోషికం తగ్గించుకున్నా. నిర్మాత నిజంగానే కట్టలేని పరిస్థితుల్లో నాకు రావాల్సిన మొత్తం వదులుకోవడానికి సిద్ధమే. సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్లు వెళ్లడం వెళ్లకపోవడం ఆమె ఇష్టం. ఆయా నిర్మాతలకు లేని అభ్యంతరం మిగతావారికి ఎందుకు? ఈ స్థాయికి రావడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇలాంటి మాటలు రావడం బాధాకరం' అంటోంది నయనతార.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News