ఆ స్టార్ హీరోయిన్ డ్రగ్స్ అమ్ముతుందట

Update: 2018-05-17 16:52 GMT
సౌత్ లో గత కొన్నేళ్లుగా టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ నయనతార. ఎంత మంది యంగ్ అండ్ సెక్సీ హీరోయిన్స్ వచ్చినా కూడా అమ్మడి అవకాశాలకు ఎసరు పెట్టలేకపోయారు. తనకు వచ్చిన అవకాశాలను నయన వరుసగా చేసుకుంటూ వెళుతూనే ఉంది. ఆ సినిమా అడుతుందా లేదా అని ఎక్కువగా ఆలోచించకుండా నటిగా తనకు మంచి గుర్తింపు ఉంటుందా లేదా అనే ఒక్క విషయాన్ని మాత్రమే  ఆలోచించి కథను ఒకే చేస్తుంది.

ఇక మరికొన్ని రోజుల్లో మరొక డిఫరెంట్ కథతో అమ్మడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కొలమావు కోకిల. ఈ ప్రాజెక్ట్ వినగానే అమ్మడు సింగిల్  సిట్టింగ్ లో ఒకే చేసిందట. ఇందులోని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. నయనతార దొంగతనంగా డ్రగ్స్ అమ్ముతుందట. ఆర్థికంగా దెబ్బతిన్న ఓ యువతి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంది. అలాగే లైఫ్ కోసం ఆమె స్మగ్లింగ్ వైపుగా ఎలా వెళ్లింది అనే అంశం హైలెట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాపై కోలీవుడ్ లో అంచనాలు పెరుగుతున్నాయి.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక నయనతార ప్రస్తుతం మరికొన్ని కోలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News