బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ కి సక్సెస్ ఉంది. సూపర్ హిట్ కాంబినేషన్ ఇది. ఇప్పటికే సింహా-లెజెండ్.. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రెగ్యూలర్ షూటింగ్ ని ప్రారంభమైంది. ఈ సినిమా పై అభిమానుల్లో రకరకాల ఆందోళనలు నెలకొన్నాయన్నది తాజా సమాచారం.
మారిన ట్రెండ్ లో ఇప్పుడు మాస్ మసాలా కమర్షియల్ అంశాల కంటే కథ కంటెంట్ టెక్నిక్ పైనే జనం మనసుపడుతున్నారు. అలాంటప్పుడు ఒక రెగ్యులర్ మాస్ మసాలా సినిమా తీస్తే కష్టమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ మార్క్ మాస్ డైలాగులు.. బోయపాటి మార్క్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంటే ఆందోళన పెరుగుతోందట.
బోయపాటి వ్యవహారం తెలిసిన వారిగా బాలయ్య అభిమానులు టెన్షన్ పడుతుండడం చర్చకొచ్చింది. బాలకృష్ణకు గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. పైసా వసూల్ -జై సింహా- ఎన్టీఆర్ బయోపిక్.. తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇటీవల వచ్చిన రూలర్ బాక్సాఫీసు వద్ద ఘోరపరాజయం చవి చూసింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు తక్షణం ఓ హిట్ కావాలి. అదే సమయం లో దర్శకుడు బోయపాటి శ్రీనుకి కీ సరైనోడు తర్వాత హిట్ లేదు. జయ జానకి నాయక-వినయ విధేయ రామ చిత్ర ఫలితాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యం లో వీరిద్దరికి ఓ హిట్ కావాలి. అందుకే మూడో ప్రయత్నంపై ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇటీవల రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద హవా తగ్గిపోయింది. నవ్య రీతుల్లో ఉండే కథలను కమర్షియల్ గా చెప్పిన చిత్రాలే బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తున్నాయి. టోటల్ గా కొన్ని మాస్ ఎలిమెంట్స్.. హీరో ఎలివేషన్ షాట్స్ తో.. ఆరు డ్యూయెట్స్ ఎనిమిది ఫైట్లతో చిన్న కథని రెండున్నర గంటల పాటు లాగించేద్దమనుకుంటే దిమ్మదిరిగే ఫలితాన్ని ఆడియెన్స్ ఇస్తున్నారు. అందుకే తాజా హ్యాట్రిక్ చిత్రాన్ని రెగ్యులర్ మూస మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తారా? లేక ఓ భిన్నమైన కథని విభిన్నంగా ఆవిష్కరిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఓ వైపు బాలయ్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోకి బోయపాటి ఎలాంటి సినిమాని ఇవ్వబోతున్నాడోనన్న టెన్షన్ అలుముకుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకి మరో ఫ్లాప్ ఇస్తే పరిస్థితి ఏంటి? మిగతా హీరోల అభిమానుల ముందు తలెత్తుకోగలమా? అనే మీమాంస అభిమానుల్ని నమిలేస్తోందట.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం లో అంజలి- శ్రియా కథా నాయికలుగా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. కెమెరామెన్‌గా రాంప్రసాద్ తో వివాదం పరిష్కరించుకుని తిరిగి రిపీట్ చేస్తున్నారు. సినిమా వేగంగా పూర్తి కావాలంటే రాంప్రసాదే ఉండాలని బోయపాటి భావిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన్నే కన్ఫమ్ చేసినట్టు సమాచారం.