ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి... ఇటీవలే ఒక సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఆయన భార్య పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన మరింత జోష్ తో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. కొత్తదనంతో కూడిన కథ ఉంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ నెలలోని మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ ఉండనుందని సమాచారం. ఈ చిత్ర రెండో యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాలో ఇదే కాస్ట్లీ షెడ్యూల్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ నటిస్తారని తెలుస్తోంది. ఆయనకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనిల్ రావిపూడి అర్జున్ రాంపాల్ కు కథ వినిపించాడని టాక్. ఇక తారక రత్న పేరు కూడా వినిపించింది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ అందుకు సంబంధించిన అధికారిక సమాచారం అయితే వెలువడాల్సి ఉంది.
షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడు పోషించని పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు అనిల్ రావిపూడి తాలుకూ కామెండీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే బాలయ్య ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడటం ఖాయం. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తోందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.