పొగ‌మంచు వ‌ల్ల NBK హెలీకాఫ్ట‌ర్ ఆల‌స్యం?

Update: 2023-01-07 09:26 GMT
వీర‌సింహారెడ్డిలో వీర రౌద్ర‌ ర‌సం ఎలా ఉంటుందో నిన్న‌టి (శుక్ర‌వారం) సాయంత్రం ట్రైల‌ర్ లో వీక్షించిన అభిమానులు సంక్రాంతి ఎపుడెపుడొస్తుందా? అంటూ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. న‌ట‌సింహం సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లతో త‌న సినిమా ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. నిన్న సాయంత్రం ఒంగోలులో ప్రీరిలీజ్ వేడుక‌లో బాల‌య్య వేదిక‌పై వాక్చాతుర్యం వీక్షించిన వారికి మ‌తులు చెడాయి.

అదంతా స‌రే కానీ న‌ట‌సింహా ఒంగోలు నుంచి నేరుగా హైద‌రాబాద్ కి ఏ మార్గంలో చేరుకున్నారు?  నిన్న సాయంత్రం ఒంగోలులో ప్రీరిలీజ్ వెన్యూ ప‌రిస‌రాల‌లో ల్యాండ్ అయిన బాల‌య్య తిరిగి అదే హెలీకాఫ్ట‌ర్ లోనే హైద‌రాబాద్ కి రిట‌ర్న్ అయ్యారా? అంటే.. దానికి తాజా అప్ డేట్ అందింది.

బాల‌య్య‌బాబు త‌న టీమ్ తో హైద‌రాబాద్ కి రీచ్ అయ్యార‌ని తెలిసింది. అయితే ఇంత ఆల‌స్యం దేనికి?  నేటి ఉద‌య‌మే హెలీకాఫ్ట‌ర్ లో గంట‌న్న‌ర‌లో ఇక్క‌డ‌ దిగిపోవ‌చ్చు క‌దా? అన్న సందేహం క‌లిగితే డీప్ గా వివ‌రాల్లోకి వెళ్లాలి.

నిజానికి ఈ రోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్‌ రావాల్సిన నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్‌ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన  అక్క‌డే ఆగిపోయింది. పొగమంచు కారణంగా పైలెట్ ఒంగోలులోనే ల్యాండింగ్ చేశారు. మరికొద్ది సేపట్లో తిరిగి హైదరాబాద్ బయలుదేరతార‌ని ఆ త‌ర‌వాత క‌బురందింది.

ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ కి బాల‌య్య చేరుకున్నార‌ని తెలిసింది.  వీర సింహారెడ్డి రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా నిన్న (శుక్రవారం) హెలికాప్టర్ లో ఒంగోలు వచ్చినప్పుడు త‌న‌తో పాటే శ్రుతిహాస‌న్- న‌వీన్ ఎర్నేని ఆయ‌న‌తో పాటు ప్ర‌యాణించిన సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News