రణ్‌ వీర్ సింగ్ నుండి ఎలాంటి అభ్యర్థనలు రాలేదు : ఎన్సీబీ అధికారి

Update: 2020-09-25 16:00 GMT
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ లోని డ్రగ్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తో పాటు పలువురికి సమన్లు జారీ చేసింది. 2017లో దీపికా ఆమె మేనేజరు కరిష్మా ప్రకాష్ తో జరిపిన వాట్సాప్ ఛాట్ బయటపడటంతో ఎన్సీబీ ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్ నిమిత్తం గోవాలో ఉన్న దీపికా పదుకునే.. రేపు ఎన్సీబీ విచారణకు హాజరవడం కోసం భర్త రణవీర్ సింగ్ తో కలిసి ముంబైకి చేరుకున్నారు. అయితే విచారణకు తన భార్య దీపికాతో కలిసి వచ్చేందుకు తనను అనుమతించాలని రణవీర్ సింగ్ ఎన్సీబీ అధికారులను కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారని వార్తలు వచ్చాయి. దీపిక కొన్ని సమయాల్లో ఉద్వేగానికి గురవుతుందని.. భయపడుతుంటుందని.. అందువలన విచారణకు హాజరయ్యేందుకు తనకూ అనుమతివ్వాలని అందులో రణవీర్ పేర్కొన్నట్లు చెప్పుకున్నారు.

అయితే ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ ఇండియా టుడే వెల్లడించిన కథనం ప్రకారం ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి ఒకరు ఇండియా టుడే తో మాట్లాడుతూ 'సమన్లు జారీ చేసిన ఏ వ్యక్తి నుంచి కూడా అలాంటి అభ్యర్థన రాలేదని.. దీపికా పడుకునే నుంచి వచ్చిన చివరి ఈ మెయిల్ దర్యాప్తుకు వస్తున్నట్లు చెప్పడం గురించే' అని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇదే క్రమంలో సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లను రేపు విచారించనున్నారు.
Tags:    

Similar News