డ్రగ్స్ కేసులో తన గురించి ఏదైనా వార్తా కథనాలను ప్రచురించడం లేదా ముద్రించడం లేదా ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ దిల్లీ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయినా ఎన్.సి.బి స్కానర్ పరిధిలో రకుల్ పై విచారణ జరిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేకాదు.. విచారణలో భాగంగా రకుల్ ప్రీత్ ఫోన్ ని ఎన్.సి.బి స్వాధీనం చేసుకుందని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. నటి రకుల్ ప్రీత్ సింగ్ చట్టబద్దమైన మార్గాన్ని తీసుకొని దిల్లీ హైకోర్టును ఆశ్రయించినా కానీ.. కేసు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరిశీలనలో ఉంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఎన్‌సిబి ప్రస్తుతం డ్రగ్స్ కోణాన్ని పరిశీలిస్తోంది. డ్రగ్స్ కేసులో నటీమణులు దీపికా పదుకొనే- సారా అలీ ఖాన్- శ్రద్ధా కపూర్లను ఎన్.సిబి ప్రశ్నించినట్లు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. దక్షిణాది నటి రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఎన్.సిబి వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిందని సమాచారం. ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాను కూడా ఏజెన్సీ ప్రశ్నించింది.
తాజా సమాచారం ప్రకారం.. దీపికా పదుకొనే - సారా అలీ ఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ - సిమోన్ ఖంబట్టా మొబైల్ ఫోన్లు ఎన్.సిబి స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఔషధాల సరఫరా ఎలా జరుగుతుందో దర్యాప్తు చేయాలనుకుంది. అంతేకాదు.. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగత వినియోగదారులను పట్టుకోవడమే కాదు. వారు జరిపిన దర్యాప్తులో ఎన్.సిబి తన పరిధిని ఇంకా విస్తరిస్తూ ఇందులో మొత్తం గుట్టును బయటకు లాగాలని ప్రయత్నిస్తోంది.