హాలీవుడ్ బాట పట్టిన మరో బాలీవుడ్ హీరోయిన్..!

Update: 2022-11-01 02:30 GMT
బాలీవుడ్ హీరోయిన్ నీతూ చంద్ర దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. హిందీలో గ్లామర్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న నీతూ చంద్ర దక్షిణాదిలో మాత్రం నటన పరంగా ఆకట్టుకున్నారు. దీంతో ఈ భామకు పలు హిందీతోపాటు పలు తమిళం.. కన్నడ.. తెలుగు.. భోజ్ పురి భాషల్లో నటించే ఛాన్స్ దక్కింది.

తమిళంలో 'యావరులం నలం'.. 'తీరాలి విళైయాట్టు పిళ్ళె'.. 'ఆది భగవాన్'.. 'వైగై ఎక్స్ ప్రెస్'.. వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'గోదావరి' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ మరదలు పాత్రలో నీతూ చంద్ర అందరినీ ఆకట్టుకుంది. దీంతో తెలుగులోనూ ఈ భామకు ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది.

అలాగే హిందీ.. బోజ్ పురి సినిమాల్లో నటించడంతోపాటు పలు స్పెషల్ ఐటమ్ సాంగ్స్ లోనూ తళుక్కుమంది. 'యుద్ధం చేయ్' అనే సినిమాలో నీతూ చంద్ర చేసిన ఐటమ్ సాంగ్ కుర్రకారుకు ఫిదా అయిపోయి అభిమానులుగా మారిపోయారు. నీతూ చంద్ర తాజాగా ఓ ఇంటర్వ్యూల తన హాలీవుడ్ ఎంట్రీపై స్పందించారు.

హాలీవుడ్ చిత్రాల్లో నటించాలని తాను ఎప్పటి నుంచో కలలు కంటున్నానని తెలిపారు. తన కల ఇప్పటికే నెరవేరిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించిన 'బ్యాడ్ బాయ్' చిత్రం పివ్యూను అమెరికాలోని సోని పిక్చర్స్ స్టూడియోలో గతంలో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం రావడంతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు.

అక్కడే నెవర్ బ్యాక్ డౌన్ చిత్ర నిర్మాత డేవిన్ జలోన్ తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఈ సందర్భంగా తన ఆత్మ రక్షణకు సంబంధించిన విద్యను ఆయన చూశారని  తెలిపింది. అప్పుడే తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు నీతూ చంద్ర తెలిపింది. తాజాగా డేవిన్ జలోన్ నిర్మిస్తున్న ఓ హాలీవుడ్ చిత్రంలో తనకు ఆఫర్ వచ్చిందని తెలిపారు.

కాగా పలువురు తనను హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నావా? అని అడుతున్నారని.. ఇప్పుడు అక్కడ రెండు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని నీతూ చంద్ర క్లారిటీ ఇచ్చింది.

తాను హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ తమిళంలో నటించే ఛాన్స్ ను వదులుకోనని తెలిపింది. తమిళ సినిమాలతోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. తనకు దక్షిణాదిలో ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారని నీతూ చంద్ర తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News