'గోదావరి' బ్యూటీ క్యారెక్టర్ రోల్స్ కోసం చూస్తోందా..?

Update: 2020-04-04 07:36 GMT
గోదావరి బ్యూటీ క్యారెక్టర్ రోల్స్ కోసం చూస్తోందా..?
  • whatsapp icon
తెలుగు వారికి కూడా పరిచయం ఉన్న భామ నీతూ చంద్ర. సుమంత్ హీరోగా నటించిన 'గోదావరి' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'సత్యమేవ జయతే' చిత్రంతో చాలా రోజులకు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాధవన్ తో నటించిన '13బి' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం - అభినయం రెండూ ఉన్నా ఈ భామ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అందాల ఆరబోతకు కూడా వెనుకాడదు కానీ, వచ్చిన అవకాశాలు సరైన హిట్‌ ను ఇవ్వకపోవడంతో నీతూ చంద్ర స్టార్ కాలేకపోయింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. 2003లో సినీ కెరీర్ ప్రారంభించిన నీతూ అడపా దడపా సినిమాలు చేస్తూ స్పెషల్ అప్పీరియన్స్‌ లతో - ఐటమ్ సాంగ్స్‌ తో తన ఉనికిని చాటుకుంటోంది. అలాగే టీవీ షోలతో కూడా ప్రేక్షకులను పలకరిస్తూ ఉంది. నిర్మాతగా మారి బోజుపురి సినిమాలను కూడా నిర్మించింది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఈ బిహారీ భామ సోషల్ మీడియా లో ఫోటోలు అప్ లోడ్ చేసింది.

హాటు హాటు ఫోటో సెషన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలకెక్కుతుండడం నీతూకు అలవాటే. ఆమె ఫొటోలు కుర్రకారుని వెర్రెత్తిస్తుందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఒక ఫొటోషూట్‌ లో బికీనీ వేసుకుని ఇంకో బికినీ భామ మీద పడి వాటేసుకుని అటూ ఇటూ దొర్లి విరగబడి నటించేసరికి నీతూ లెస్బియన్‌ అనే రూమర్‌ అప్పట్లో ఇండస్ట్రీలో షికారు చేసింది. ఇప్పుడు తాజా ఫోటోలో సైకిల్ పక్కన కూర్చొని బ్లాక్ డ్రస్‌ లో అందాలను ఎర వేస్తూ ఆకట్టుకుంది. మూడు పదుల వయస్సులో కూడా అందాల ఆరబోతలో యువ హీరోయిన్లకు కూడా పోటీ ఇవ్వగలదు నీతూ. నీతూ చంద్ర ఇచ్చిన ఈ స్టిల్ ఇంటర్నెట్‌ లో వైరల్‌ గా మారింది. ఈ ఫోజులు చూసైనా కారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలైనా నీతూకి ఆఫర్ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News