సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొడుతున్నాం..!
విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనీల్ రావిపుడి సినిమా గురించి మరిన్ని విశేషాలు పంచుకునేందుకు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ సజెషన్ ఎవరిది? సంక్రాంతికి రేసులోకి రావడానికే ఈ టైటిల్ అనుకున్నారా?
కథ అనుకున్నప్పుడు ఫెస్టివల్ ఫిల్మ్ అనుకోని స్టార్ట్ చేశాం. వెంకటేష్ గారితో చేసిన ఎఫ్2 పొంగల్ కి వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎఫ్3 కూడా పొంగల్ కి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్ కి తీసుకొస్తే బావుటుందని సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం. కానీ అప్పుడు అనౌన్స్ చేయలేదు. ఈ కథ ఒక రేస్క్యు ఆపరేషన్ కి సంబధించింది. సెకండ్ హాఫ్ లో నాలుగు రోజులు జర్నీ సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. కథ అనుకున్నప్పుడే సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ఫిక్స్ అయ్యాం.
మీరు చేసిన ప్రమోషన్స్ చాలా వైరల్ అయ్యాయి. సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉండటానికి కారణం ?
కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే రిపోదు. థియేటర్స్ కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ వుండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తోచ్చుకోగాలమని నా అభిప్రాయం. ఈసారి సోషల్ మీడియాపై ఎక్కవ ఫోకస్ చేశాం. వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ దిగి సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్ కి చాలా హెల్ప్ అయ్యింది.
రమణగోగుల గారితో పాడించాలనే ఆలోచన ఎవరిది?
భీమ్స్ ఇచ్చిన గోదారి గట్టు ట్యూన్ వినగానే ఒక పెక్యులర్ వాయిస్ తో పాడిస్తే బావుంటుదని అనుకుకొని రమణ గోగుల గారిని ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నాం. భీమ్స్ ఆయన్ని సంప్రదించి పాడించారు. ఈ క్రెడిట్ భీమ్స్ కి దక్కుతుంది. రమణ గోగుల గారు కూడా తన మార్క్ ని యాడ్ చేశారు. హిట్ సాంగ్ అనుకున్న పాట కాస్త ఈ రోజు గ్లోబల్ సాంగ్ అయ్యింది. 85 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.
ఐశ్వర్య రాజేష్ గారి ని ఆడిషన్ చేసి తీసుకోవడానికి కారణం?
భాగ్యం క్యారెక్టర్ చాలా స్పెషల్. వెరీ ఎడ్జ్ లో నడిచేది. చాలా కేర్ తీసుకొని చేయాల్సిన క్యారెక్టర్. ఐశ్వర్య బెస్ట్ పెర్ఫార్మర్. అయితే తను గోదారి యాస ఎలా పలుకుతుంది? ఆ క్యారెక్టర్ లో తన బాడీ లాంగ్వేజ్ ఎలా వుంటుందో తెలుసుకోవడానికి చిన్న ఆడిషన్ లా చేశాం. భాగ్యం చాలా మంచి క్యారెక్టర్. ఐశ్వర్యకి మంచి పేరు వస్తుంది.
మీనాక్షి కూడా చాలా క్రమశిక్షణ గల నటి. తనకి మంచి టైం సెన్స్ వుంది. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. ఇద్దరూ ఆదరగొట్టారు.
వెంకటేష్ గారితో పాట పాడించాలనే ఆలోచన ఎవరిది ?
వెంకటేష్ గారికి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ చాలా నచ్చేసింది. ఆయనే స్వయంగా పాడతానని చెప్పారు. నేను షాక్ అయ్యాను. అదే టైమింగ్ లో ఓ రీల్ చేశాం. వెంకటేష్ గారు 20 నిమిషాల్లో ఆ పాట పడేశారు. వెంకీ గారు పాడిన తర్వాత భీమ్స్ కూడా షాక్ అయ్యాడు.
భీమ్స్ తో వర్క్ చేయడం గురించి ?
భీమ్స్ తో పని చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. పటాస్ సమయంలో తనతో ఐదు పాటలు రెడీ చేయించాను. కానీ అది కుదరలేదు. మళ్ళీ ఈ సినిమాతో తనతో పని చేయడం హ్యాపీగా వుంది. తనతో పని చేయడం చాలా ఫ్లెక్సి బుల్ గా వుంటుంది. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బీజీఎం వండర్ ఫుల్ గా వుంటుంది. సీన్ కి తగ్గట్టుగా మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది.
ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు అనే డైలాగు వెనుక ఉద్దేశం?
జీవితంలో అందరికీ ఎదో ఒక గతం వుంటుంది. ఎక్స్ ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రష్ వుంటుంది. పెళ్లి అయినాక ఓపెన్ గా వుండాలని చెప్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ మొదలౌతాయి. అందుకే గతం జోలికి పోకుండా హాయిగా ప్రజెంట్ లో వుండటమే మంచిది(నవ్వుతూ)
దిల్ రాజు గారి బ్యానర్ లోనే ఎక్కువగా చేయడానికి కారణం ?
ఆయనతో నాకు పటాస్ సినిమాతో ట్రావెల్ వుంది. నాకు ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళతోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. దిల్ రాజు గారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీ. అల్మోస్ట్ పదేళ్ళ జర్నీ.
ఎఫ్ 2 నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకూ వెంకటేష్ గారితో జర్నీ ఎలా వుంది?
ఎఫ్2, ఎఫ్3 కంటే సంక్రాంతికి వస్తున్నాంతో మా బాండింగ్ డబుల్ అయ్యింది. ఈ సినిమాతో బెస్ట్ బడ్డీస్ అయిపోయాం. చాలా క్లోజ్ అయ్యాం. వెంకటేష్ గారితో సినిమాలు ఇలానే కంటిన్యూ చేయాలని భావిస్తున్నాను.
ఈ సినిమాతో వెంకటేష్ గారితో ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేశాను. ఎంటర్ టైన్మెంట్ తో పాటు క్రైమ్ రెస్క్యు ఎడ్వంచర్ లా వుంటుంది. సెకండ్ హాఫ్ డిఫరెంట్ జోనర్ లో వుంటుంది. వెంకీ గారితో యాక్షన్ సినిమా చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ కే పెద్దపీట వేస్తాను. ఆయనతో ఆ ఎంటర్ టైన్మెంట్ నాకు చాలా ఇష్టం.
మీకు హీరోలతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది కదా.. అది ఎలా సాధ్యపడుతుంది ?
హీరోలని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అభిమానించానో వాళ్ళతో సినిమా చేసినప్పుడు కూడా అదే అభిమానంతో వుంటాను. నేను హీరోలకి ఫ్యాన్ బాయ్ లానే వుంటాను. రిలేషన్ ని పాజిటివ్ గా ఉంచుతాను కాబట్టి వాళ్ళ నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం యూఎస్పీ ఏమిటి ?
ఈ సినిమా యూఎస్పీ ఇప్పటికే ఆడియన్స్ కి రీచ్ చేయగలిగాం. సినిమాని చూడటానికి ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. అద్భుతమైన సాంగ్ వున్నాయి. ట్రైలర్ లో ఫన్ మూమెంట్స్ అలరించాయి. సినిమాలో చూడటానికి ఎంగేజింగ్ కంటెంట్ వుందని ఫిక్స్ అయ్యారు, థియేటర్స్ కి వచ్చాక అద్భుతంగా నచ్చితే సినిమా బ్లాక్ బస్టర్. సినిమాకి వచ్చిన ఆడియన్స్ హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు.
ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఎలా అనిపించింది ?
వెరీ హ్యాపీ. వెంకటేష్ గారితో ఎఫ్2, ఎఫ్3 చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో అంతే కాన్ఫిడెంట్ గా వున్నాం. పబ్లిక్ కూడా మేము హిట్ కొట్టేస్తామని కాన్ఫిడెంట్ గా వుండటం ఇంకా హ్యాపీ.
వీటీ గణేష్ పాత్ర ఎలా వుంటుంది ?
నరేష్ గారు, వీటీ గణేష్ గారి పాత్రలతో ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరి పాత్రలు హైలెట్ గా వుంటాయి.
మీ డ్రీం స్టొరీ ఏదైనా ఉందా ?
విమెన్ సెంట్రిక్ గా ఒక స్పోర్ట్స్ స్టొరీ చేయాలని ఎప్పటినుంచో వుంది. కొన్నాళ్ళ తర్వాత స్పోర్ట్స్ డ్రామా చేస్తాను.
ఎఫ్4 ఎప్పుడు ?
డెఫినెట్ గా వుంటుంది. అయితే దానికి ఇంకా సమయం వుంది. సంక్రాంతికి వస్తున్నాంని కూడా ఫ్రాంచైజ్ చేసుకునే స్కోప్ వుంది.