ఎంత సాధించినా ఇంకా అసంతృప్తేనా?

Update: 2016-02-15 04:55 GMT
ఓ రంగంలో సక్సెస్ అయ్యి, కొంత సాధించిన తర్వాత మరింతగా సాధించాలనే తపన ఉంటుంది. అనుకున్న దానికి మించి సాధించినపుడు  సంతృప్తి ఉంటుంది. అయితే.. సంతృప్తి పడిపోయి అక్కడితో ఆగకుండా.. మరింతగా ఎదిగేలా తమ జీవితాలను మలుచుకుంటూ ఉంటారు తారలు. కానీ కొందరు బాలీవుడ్ భామలు మాత్రం.. అసలు  తామింకా అసంతృప్తిగానే ఉన్నామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

'మోడలింగ్ రంగంలో బిజీగా ఉన్న టైంలోనే యాక్ట్రెస్ గా మారి, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యాను. అయితే ఇప్పటికీ నేను నటిగా అసంతృప్తిగానే ఉన్నా. యాక్టింగ్ లోనే కాదు.. ఇతర రంగాల్లో పని చేసే వారికీ ఇలాంటి ఫీలింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. అయితే, నా ఎదుగుదలకు ఇది అడ్డంకి కాదు. నాకు పరిస్థితులను ఎదుర్కోవడం కొత్త కూడా కాదు. నాకొచ్చే అవకాశాలతో ఈ సిట్యుయేషన్ ని ఫేస్ చేసేందుకు ట్రై చేస్తున్నా' అంటోంది నేహా ధూపియా.

'రెండేళ్లు సినిమాలు లేకపోతే, పరిణీతి ఖాళీగా ఉందని అంతా అనుకున్నారు. నేను యాక్టింగ్ చేయకపోవచ్చు కానీ.. బిల్డ్ దట్ వే అనే కేంపెయిన్ చేస్తున్నా, ఈవెంట్స్ చూసుకున్నా. చిన్నపుడే హిందుస్థానీ సంగీతం నేర్చుకోవడంతో, సింగర్ అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు యాక్ట్రెస్ గా కొనసాగాల్సి వస్తోంది. ఇన్నేళ్లకు మేరీ ప్యారీ బిందు చిత్రంలో నటిగా చేయడంతో పాటు సింగర్ కూడా పాడే అవకాశం వచ్చింది' అంటోంది పరిణీతి చోప్రా.
Tags:    

Similar News