వీడిలాంటి కుక్కలకు ఇలాగే బుద్ది చెప్పాలి : నటి

Update: 2018-11-23 11:12 GMT
సెలబ్రెటీలకు కొన్ని సార్లు సామాన్యుల నుండి కూడా లైంగిక వేదింపులు ఎదురవుతాయి. ఫోన్‌ నెంబర్‌ సంపాదించి లేదంటే సోషల్‌ మీడియా ద్వారా అభిమానం పేరుతో హీరోయిన్స్‌ ను - నటీమణిలను లైంగికంగా వేదించిన వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా మలయాళ నటి నేహా సక్సేనాను యూఏఈకి చెందిన ఒక వ్యక్తి వేదించాడు. దాంతో ఆ విషయాన్ని అతడి వివరాలతో సహా షేర్‌ చేసి అతడి పరువు తీసి బజారున నిలబెట్టింది.

యూఎఈకి చెందిన ఈ వ్యక్తి నా పీఆర్‌ నెంబర్‌ సంపాదించి - ఒక రాత్రికి నేహా సక్సేనా దుబాయిలో నాతో గడుపుతుందా - ఒకసారి నాకు తెలియజేయండి అంటూ వాట్సప్‌ మెసేజ్‌ పెట్టాడు. ఆ విషయాన్ని నా పీఆర్‌ నా వద్దకు చెప్పాడు. యూఏఈ స్నేహితుల ద్వారా అతడిని ట్రేస్‌ చేయడం జరిగిందని నేహా సక్సేనా పేర్కొంది.

ఇలాంటి మగవారి వల్ల ఆడవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు ఖచ్చితంగా శిక్షించబడాలి. మీ అందరికి మహిళలు అంటే కాస్త గౌరవం ఉన్నా కూడా ఇలాంటి కుక్కలకు బుద్ది చెప్పాలంటూ అతడి ఫోన్‌ నెంబర్‌ - ఫొటోతో సహా - పీఆర్‌ తో అతడు చేసిన చాట్‌ ను స్క్రీన్‌ షాట్‌ తీసి మరీ పోస్ట్‌ చేసింది. ఇది కాస్త వైరల్‌ అవ్వడంతో ఆ వ్యక్తి పరువు పోయింది. ఆ నెంబర్‌ కు ఎంతో మంది ప్రయత్నించి చూస్తున్నారు. కాని ఆ ఫోన్‌ నెంబర్‌ అందుబాటులో లేకుండా పోయింది. ఆ వ్యక్తికి నేహా సక్సేనా సరిగ్గా బుద్ది చెప్పిందంటూ అభినందనలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News