ఈసారి బ్లాక్‌బికినీ ఫెస్టివ‌ల్‌

Update: 2018-08-30 04:43 GMT
చిరుత గాళ్ నేహా శ‌ర్మ‌ అన్ లిమిటెడ్ బికినీ ఫెస్టివ‌ల్ ఇంకా ఇంకా వెబ్‌ని ఒణికిస్తూనే ఉంది. ఈ బికినీ ఫెస్ట్‌కి ఎండింగ్ అన్న‌దే క‌నిపించ‌డం లేదు. ఇదివ‌ర‌కూ మ్యాగ్జిమ్ క‌వ‌ర్‌షూట్ కోసం అన్‌లిమిటెడ్‌గా అందాలు ఆర‌బోసిన నేహా, రోజుకో బికినీ ఫోటోని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో అప్‌లోడ్ చేసి కుర్ర‌కారుకు కంటిపై కునుకుప‌ట్ట‌నివ్వ‌కుండా చేసింది.

పెర్ఫెక్ట్ బికినీ బాడీకి కేరాఫ్ అడ్రెస్ నేనే అనేంత‌గా ప్ర‌శంస‌లు అందుకుంది. ఒంపుసొంపుల వ‌డ్డ‌న‌ల్లో నేహా కిర్రాక్ లుక్ మ‌తిచెడ‌గొట్టింది. ఈసారి పూల్ సైడ్ నేహా బ్లాక్ బికినీ లుక్ కిర్రాక్ పుట్టిస్తోంది. త‌డిసిన అందాల జాత‌ర వెర్రెక్కిస్తోంది. పూల్‌లో రిలాక్స్ మోడ్‌లో క‌నిపించి ఆక‌ట్టుకుంది.

నేహా ఈ తీరుగా రెచ్చిపోవ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ బాలీవుడ్‌లో రీఫ్రెష్ లుక్‌తో రీలాంచ్ అవుతోంది. అందుకే తాజా ఫోటోషూట్‌తో వేడి పెంచ‌డ‌మే ధ్యేయంగా ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కు ట‌చ్‌లోకి వెళుతోంది. కిలాడీ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న `హేరా ఫేరి 3` లాంటి క్రేజీ ఆఫ‌ర్‌ని అందుకున్న ఈ భామ కెరీర్ ని స్కైలోకి తీసుకెళ్ల‌డ‌మే ధ్యేయంగా ఇలా చెల‌రేగిపోతోంద‌ని అర్థం చేసుకోవాలి.
Tags:    

Similar News