చిరుత పిల్ల ఇప్పుడైనా కొడుతుందా?

Update: 2016-10-19 22:30 GMT
'చిరుత' సినిమాతో ఆరంగేట్రం చేసిన చిరు తనయుడు రామ్ చరణ్‌ ఆ ఒక్క సినిమాతోనే 'మెగా పవర్ స్టార్' అయిపోతే.. అదే సినిమాతో మన ముందుకు వచ్చిన హీరోయిన్ నేహా శర్మ మాత్రం.. ఇంకా అక్కడే ఉండిపోయింది. ఇటు టాలీవుడ్ లో ఎలాగో ఆఫర్లు లేవు.. కాని ఆఫర్లు వస్తున్న బాలీవుడ్ లో కూడా అమ్మడు హిట్టు కొట్టలేక ఇబ్బందులు పడుతోంది.

గతంలో వచ్చిన హిట్టయిన తుమ్ బిన్ సినిమాకు ఇప్పుడు బాలీవుడ్ లో సీక్వెల్ వస్తోంది. ఈ సినిమా పేరు ''తుమ్ బిన్ 2''. ఇందులో ఇద్దరు హీరోల సరసన హీరోయిన్ గా నేహా శర్మ నటిస్తోంది. ఈ చిరుత బ్యూటి నిన్న ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో 2010లో క్రూక్ సినిమా చేశాక.. యంగిస్తాన్ - క్యా సూపర్ కూల్ హై హమ్ వంటి సినిమాలు చేసినా కూడా.. తనకు మంచి అవకాశాలే రాలేదట. ఇప్పుడు తుమ్ బిన్ తో ప్రూవ్ చేసుకుంటా అని సెలవిచ్చింది.

2001లో తుమ్ బిన్ సినిమాను తీసిన అనుభవ సిన్హా ఇప్పుడు ఈ సీక్వెల్ ను తీస్తున్నాడు. ఈ హిట్టు అతనికి కూడా ముఖ్యం. మరి మన చిరుత పిల్లకు కూడా ఒక హిట్టిచ్చి ఆమెతో కొబ్బరికాయ కొట్టిస్తాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News