ఉగాదికే వ‌న్నె తెచ్చిన టిల్లు భామ‌!

Update: 2022-04-05 02:30 GMT
`డిజే టిల్లు` స‌క్సెస్ తో తొలి స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది ముంబై బ్యూటీ నేహాశెట్టి. తొలి ప్ర‌య‌త్నం `మెహ‌బూబా` బెడిసి కొట్టింది. అటుపై న‌టించిన మ‌రో సినిమా  `గ‌ల్లీరౌడీ` ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో బ్యూటీ పై  బ్యాక్ టూ పెవిలీయ‌న్ అనే ప్ర‌చారం సాగింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో `డీజే టిల్లు` లో అవ‌కాశం వ‌చ్చింది. సిద్దు జొన్న‌ల గ‌డ్డ హీరోగా సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్  నిర్మించిన  కామెడీ ఎంట‌ర్ టైన్ బ్లాక్  బ‌స్ట‌ర్ అయింది. డిఫ‌రెంట్ కామెడీ ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్ అయింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద స‌క్సెస్ గా నిలిచింది. హిలేరియ‌స్  ఎంట‌ర్ టైన‌ర్ కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. అందులో  న‌ట‌న‌కు ఆస్కారం ఉన్నల రాధిక  పాత్ర‌లో న‌టించి తెలుగు ఆడియ‌న్స్ కి మ‌రింత  చేరువైంది. ప్ర‌స్తుతం బ్యూటీ ఆ సినిమా స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా నిన్న‌టి రోజున ఉగాది సంద‌ర్భంగా అందంగా ముస్తాబైన ఫోటోల్ని నెట్టింట వ‌దిలింది.

మెడ‌లో నెక్లెస్.. డిజైన‌ర్ లెంహంగా దుస్తుల్లో నేహ‌శెట్టి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. తెలుగు సంస్కృతి ఉట్టి ప‌డేలా త‌యారైంది.  త‌ల‌లో మ‌ల్లెపూలు సైతం  ధ‌రించింది. చెవుల‌కి ఎర్ర‌టి దిద్దులు..నుదిటిన  చిన్న బొట్టు..పెద‌వుల‌కు ఎర్ర‌టి లిప్ ప‌స్ట‌లిక్ పూసుకుని యువ‌త‌ని ఆక‌ర్షించే లుక్ లో ఆక‌ట్టుకుంటోంది.

ఫోటో సెష‌న్ కోసం  ముఖంలో ర‌క‌ర‌కాల ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ముంబై బ్యూటీ తెలుగు అమ్మాయిలా ముస్తాబవ్వ‌డం నెటి జ‌నుల్ని విశేషంగా  ఆక‌ట్టుకుంటుంది. ఇక `డిజే టిల్లు` స‌క్సెస్ తో అమ్మ‌డికి బాగానే అవకాశాలు త‌లుపు తడుతు న్నాయని స‌మాచారం. మీడియం రేంజ్ హీరోల‌కు ప్ర‌మోట్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. స‌క్సెస్ గ్రాఫ్ లో తెలివైన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగాల‌ని ఆశిద్దాం. 
Tags:    

Similar News