నేల టిక్కట్టు సేఫ్ జోన్ బిజినెస్

Update: 2018-05-24 10:10 GMT
టాలీవుడ్ లో సేఫ్ జోన్ లో బిజినెస్ చేసే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఓ విధంగా ఆ లెవెల్ లో ఉండే హీరోలే అందుకు కారణం. అలాంటి హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు. గతంలో మినిమమ్ గ్యారెంటీ అని నిర్మాతలను బాగా ఆకర్షించిన ఈ హీరో వరుస ఫెయిల్యూర్స్ తో తరువాత గత ఏడాది వరకు  కొంచెం డౌన్ అయినా రాజా ది గ్రేట్ సినిమాతో రికవర్ అయ్యాడు. ఇక టచ్ చేసి చూడు సినిమా 27.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినప్పటికీ లాభాలు పెద్దగా రాలేదు.

ఇక ఈ సారి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చేసిన నేల టిక్కెట్టు బిజినెస్ గట్టిగానే లాభాలను తెచ్చిపెట్టాలా కనిపిస్తోంది. ప్రమోషన్స్ తో రవితేజ సినిమా స్థాయిని పెంచాడు. పైగా సినిమా ట్రైలర్ పాటలు కూడా పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. మొదటి టాక్ ను బట్టి సినిమా బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే 22.5 కోట్ల వాల్యూతో విడుదల కానుంది. ఇది మాస్ రాజా సేఫ్ జోన్ బడ్జెట్ అని చెప్పవచ్చు.

ప్రస్తుతం పోటీకి కూడా పెద్ద సినిమాలు ఏమి లేవు.చిత్ర యూనిట్ కూడా సినిమా రిజల్ట్ పై నమ్మకంతో ఉంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా వరుసగా సోగ్గాడే చిన్ని నాయన - రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో హిట్ అందుకున్నాడు కాబట్టి కచ్చితంగా అది ఓ విధంగా ప్లస్ పాయింట్. ఇక సినిమా ఏరియా వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్ర -  8Cr   
సిడెడ్ - 3 Cr
నైజం - 6Cr  
AP / TS   - 17 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.80 Cr
ఓవర్సీస్ - 1.50 Cr విలువ

ప్రపంచవ్యాప్తంగా - 20.3 Cr
ఖర్చులు సహా ప్రపంచవ్యాప్తంగా - 22.5 Cr 
Tags:    

Similar News