హిందీలో పాగా వేసేస్తున్నారుగా

Update: 2017-06-25 10:08 GMT
సౌత్ సినిమాలకు ఇప్పుడు హిందీలో విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటివరకూ మన సినిమాల డబ్బింగ్ వెర్షన్లకు.. అక్కడ టీవీల్లో మాత్రమే డిమాండ్ ఉండేది. ఇప్పుడు థియేటర్స్ లో కూడా టాలీవుడ్ సినిమాలకు.. బాలీవుడ్ లో క్రేజ్ ఊపందుకుంటోంది.

దగ్గుబాటి రానా నటించిన లేటెస్ట్ మూవీ 'నేనే రాజు నేనే మంత్రి' త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఈ సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్(హిందీ వెర్షన్ శాటిలైట్ కూడా కలిపే) రూపంలో ఏకంగా 11 కోట్ల రూపాయలు దక్కడం షాక్ కొట్టించేసింది. బాహుబలి సిరీస్ లో భల్లాలదేవుడి పాత్ర పోషించిన రానాకు.. నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. ఘాజీ ఎటాక్ మూవీతో.. సౌత్ లో కంటే నార్త్ నుంచి ఎక్కువ వసూళ్లను రాబట్టిన రికార్డ్ కూడా ఉంది. అందుకే ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను భారీ మొత్తంలో చెల్లించేందుకు బాలీవుడ్ జనాలు వెనుకాడలేదు. రానా ఎంచుకుంటున్న డిఫరెంట్ థీమ్స్ జనాలను ఆకట్టుకుంటున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కూడా హిందీ డబ్బింగ్ ప్లస్ శాటిలైట్ రూపంలో 11 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ఇప్పటికే  వార్తలున్నాయి. సెట్స్ పై ఉన్న సినిమాలకు కూడా భారీ రేట్స్ కే ఆఫర్స్ వస్తున్నాయి. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి రికార్డ్ స్థాయిలో 28 కోట్లకు డీల్ జరిగినట్లుగా టాక్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News