ఈ సంక్రాంతికి వస్తానన్న ''కాటమరాయుడు'' సినిమా టీజర్ మిస్సయిపోగా.. వేరే రెండు సినిమాల టీజర్లు రంగంలోకి దిగిపోయాయి. అసలు టీజర్ కాదిది ట్రైలర్ అన్న రేంజులో ఇటు సాయధరమ్ తేజ్ ''విన్నర్'' ఉంటే.. మరో ప్రక్కన నాని ''నేను లోకల్'' ట్రైలర్ కూడా రంగంలోకి దిగింది. ఇంతకీ వీటిపైన అసలు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందంటే..
నిజానికి ''విన్నర్'' టీజర్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదనే చెప్పాలి. ఒక్క మాస్ డైలాగ్ తప్పిస్తే.. దర్శకుడు గోపిచంద్ మలినేని కేవలం సినిమాలోని గ్రాండ్యుయర్ ఏ రేంజులో ఉందో చూపించడానికే ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఆ విధంగా పంపిణీదారులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హార్స్ రేసుల నుండి.. ఫారిన్ లో తీసిన క్వాలిటీ షాట్స్ వరకు.. బాగా కట్టిపాడేశాయి. ఈ స్టయిలిష్ లుక్ కారణంగా సినిమాకు పాయింట్లు పడిపోయి.. హైప్ పెరుగుతోంది.
ఇకపోతే నాని ''నేను లోకల్'' మాత్రం కేవలం కంటెంట్ తో కొట్టాడు. ఆ ట్రైలర్ కు 1.5 మిలియన్ హిట్స్ పైగా వచ్చేశాయంటే.. కేవలం కామెడీ డైలాగులూ.. మాస్ ఎలిమెంట్స్.. అలాగే నాని కొత్తగా ప్రయత్నిస్తున్న డ్యాన్సులు కూడా కారణం. ఎప్పుడూ నాని తన సినిమాల ట్రైలర్లలో కంటెంట్ తోనే ఎక్కువగా ఇంప్రెస్ చేస్తుండటంతో..ఈసారి కూడా ప్రేక్షకులు ఆ కంటెంట్ కే ఓటేశారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు తన ఫేవరేట్ మాస్ కామెడీతో వారిని ఊరించేశాడు.
విన్నర్ టీజర్ లుక్స్ తో.. నాని టీజర్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయిలే. మరి ధియేటర్లో సినిమాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం కాస్త ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/