'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన టటాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్.. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'సినిమా చూపిస్తా మామ' 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి విజయాలు అందుకున్న ఈ భామ.. 'రాజు గారి గది 3' తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. అయితే ఇప్పుడు ఏకంగా అర డజను ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. వాటిలో ''నెట్'' అనే వెబ్ సిరీస్ కూడా ఉంది. అవికా గోర్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈరోజు గురువారం 'నెట్' ట్రైలర్ ను రిలీజ్ చేసి టీమ్ మొత్తాన్ని అభినందించారు. బ్రిలియంట్ పెరఫార్మన్స్ తో అద్భుతమైన టీమ్ రూపొందించిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని 'మనం' డైరెక్టర్ పేర్కొన్నారు. ఇక 'నెట్' ట్రైలర్ విషయానికొస్తే.. స్సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రియ (అవికా గోర్) అనే అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని.. లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) అనే వివాహిత వ్యక్తి సీక్రెట్ కెమెరాల ద్వారా చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదంతా తన మొబైల్ ఫోన్ లో చూస్తున్న లక్ష్మణ్.. అక్కడ ఏదో మిస్టరీని కనుగొన్నాడని అర్థం అవుతోంది. ఈ క్రమంలో అతను కాంప్లెక్స్ సిచ్యుయేషన్ ని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. మీ వ్యక్తిగత జీవితాన్ని ఇతరులు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారని తెలిసినప్పుడు ఏమి చేస్తారు? అనే కాన్సెప్ట్ తో ''నెట్'' వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో ప్రణీత పట్నాయక్ - విష్ణు దేవ్ ఈ సిరీస్ లో ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.
'నెట్' సిరీస్ కు భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు. తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా - సందీప్ రెడ్డి బోర్రా దీన్ని నిర్మించారు. ఈ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ కానుంది. అవికా గోర్ - రాహుల్ రామకృష్ణ లకు ఈ సిరీస్ ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి.
Full View