41 ప్రాజెక్ట్ లతో నెం.1 కోసం నెట్‌ ఫ్లిక్స్ ప్రయత్నాలు

Update: 2021-03-06 07:30 GMT
అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున ఖాతాదారులు ఉన్న నెట్‌ ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం కాస్త వెనుకబడే ఉంది అనడంలో సందేహం లేదు. ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడంతో పాటు ఇండియన్‌ కంటెంట్ తక్కువగా ఉంటున్న కారణంగా నెట్‌ ఫ్లిక్స్ ఖాతాదారులుగా మారేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిండచం లేదు. ఈ లాక్ డౌన్‌ టైమ్‌ నుండి ఇండియాలో ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగింది. దాంతో నెట్‌ ఫ్లిక్స్ తన ఖాతాదారులను పెంచుకోవడంతో పాటు ఇండియాలో నెం.1 ఓటీటీ గా నిలిచేందుకు కోట్లు కుమ్మరిస్తోంది. కేవలం హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు.. వెబ్‌ సిరీస్‌ ఇంకా రియాల్టీ షోలు స్టాండప్‌ కామెడీలను కూడా నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

రాబోయే నెలన్నర రెండు నెలల కాలంలో నెట్‌ ఫ్లిక్స్ వారు ఏకంగా 41 ప్రాజెక్ట్‌ లను స్ట్రీమింగ్‌ చేసేందుకు ప్లానింగ్‌ పూర్తి చేశారు. మొత్తం 41 ప్రాజెక్ట్ ల్లో 13 హిందీ సినిమాలు 15 వెబ్‌ సిరీస్ లు 6 స్టాండప్ కామెడీ షో లు 4 స్పెషల్‌ డాక్యుమెంటరీస్‌ 3 రియాల్టీ షోలు స్ట్రీమింగ్‌ కు సిద్దంగా ఉన్నాయి కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇవి కాకుండా పెద్ద సినిమాలను కూడా కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు నెట్‌ ఫ్లిక్స్ ముందుకు వస్తుంది. ఈ ఏడాది చివరి వరకు నెట్‌ ఫ్లిక్స్ ఇండియాలో అత్యధిక ఖాతాదారులు ఉన్న ఓటీటీ గా నెం.1 స్థానంలో నిలిచేందుకు ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వందల కోట్ల రూపాయలను నెట్‌ ఫ్లిక్స్ ఖర్చు చేస్తోంది.
Tags:    

Similar News